నాన్నా.. నీ రుణం తీర్చుకుంటా.. | daughter-done-fathers-funeral-service | Sakshi
Sakshi News home page

నాన్నా.. నీ రుణం తీర్చుకుంటా..

Published Tue, Jul 26 2016 2:31 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

daughter-done-fathers-funeral-service

  తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
  ఏడూరులో ఘటన
 
పలమనేరు/గంగవరం : తల్లిదండ్రులకు కొడుకైనా, కూతురైనా ఒక్కటేనని నిరూపించే ఘటన గంగవరం మండలం ఏడూరులో సోమవారం చోటుచేసుకుంది. తండ్రికి కుమార్తె తలకొరివిపెట్టి, అంత్యక్రియలు నిర్వహించి, తండ్రి రుణం తీర్చుకుంది. ఏడూరు గ్రామానికి చెందిన మునస్వామి(75) అనారోగ్యంతో సోమవారం మృతిచెందాడు. ఇతనికి ఈశ్వరమ్మ, సుబ్బమ్మ అనే ఇరువురు కుమార్తెలున్నారు. అంత్యక్రియలకు బంధువులు చేరుకున్నారు. మగసంతానం లేకపోవడంతో తమ్ముడు లేదా అన్న బిడ్డలతో కర్మక్రియలు చేపట్టాలని బంధువులు భావించారు. కుమార్తెలు ససేమిరా ఒప్పుకోలేదు. తామే అంత్యక్రి యలు జరిపిస్తామని అందరినీ ఒప్పించారు. మృతుని చిన్న కుమార్తె సుబ్బమ్మ తండ్రికి తలకొరివిపెట్టి అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement