కైగల్ జలపాతంలో పర్యాటకుల సందడి
పలమనేరు: చిత్తూరు జిల్లా పలమపనేరు నియోజకవర్గంలోని కైగల్ జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కైగల్ నది ప్రవహించి బైరెడ్డిపల్లె మండలంలో హోరెత్తుతోంది. దీంతో పర్యాటకులు కైగల్ జలపాతాన్ని తిలకించేందుకు తరలివస్తున్నారు. వరుసగా మూడేళ్లపాటు నది ప్రవహిస్తుండడంతో రాళ్లు చాలా నునుపుగా మారి పాచిపట్టాయి. అడుగు పెడితే ఎప్పుడు జారుతుందో తెలియదు.
కైగల్ వాటర్‌ఫాల్స్‌లోని మృత్యుకోనలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారు. ఇక్కడ నీరు గుండ్రంగా చుట్టుకుంటూ వెళ్లి ఓ రాతి గుహలోకి చేరుతోంది. ఇందులో పడిన వ్యక్తి ఈత వచ్చినా పైకి రావడం కష్టమే. మొన్నటిదాకా కైగల్ జలపాతంలోకి పర్యాటకులు వెళ్లకుండా బైరెడ్డిపల్లె పోలీసులు నిషేధం విధించారు. కానీ అడవిలో పలు మార్గాల నుంచి పర్యాటకులు జలపాతం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడ జాగ్రత్తగా లేకపోతే విహారం కాస్తా విషాదంగా మారిపోతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. (క్లిక్: మగవాళ్లకు మాత్రమే.. ఆడవారికి నో ఎంట్రీ.. ఎందుకంటే?)
Comments
Please login to add a commentAdd a comment