
నలుగురు యువకుల మృతి
జగిత్యాల: అతి వేగం ప్రాణాలు తీసింది. మితిమీరిన వేగంతో బైక్ నడపడంతో బైక్‌లో ప్రయానిస్తున్న నలుగురు యువకులు మృత్యువాతపడ్డారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం వద్ద మితిమీరిన వేగంతో వస్తున్న ఓబైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడిక్కడే మృతిచెందారు.
మృతులు బుగ్గారాం మండలం బీరుసాని గ్రామానికి చెందిన, సురమల్ల హరీష్ , కస్తూరి సాయి, ఉరుమట్ల మధుకర్ , కాంపెల్లి మహేశ్ లుగా గుర్తించారు. మృతులందరూ 22 ఏళ్లలోపు యువకులే.