తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవంలో పాల్గొని తిరిగి వస్త్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా,
ధర్మపురి (హొసూరు), న్యూస్‌లైన్: తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవంలో పాల్గొని తిరిగి వస్త్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ధర్మపురి జి ల్లాలోని గెట్టూరు గ్రామానికి చెందిన కార్తి (30) తమ ఊరి సమీపంలోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఈయన తన స్నేహితులైన మణి, మైఖేల్‌రాజ్, కత్తాన్‌దురై, గోవిందసామి, రాము, అరవళన్, హంసరాజ్‌తో కలసి శనివారం తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవానికి వెళ్లారు.
ఆదివారం కార్తీక పౌర్ణమి కావడంతో అరుణాచలేశ్వరస్వామిని సందర్శించుకుని సో మవారం ఉదయం తిరువణ్ణామలై నుంచి వ్యాన్‌లో త మ గ్రామానికి బయలుదేరారు. కడత్తూరు సమీపంలో ని వడసలపట్టి వద్ద సోమవారం ఉదయం 5 గంటల సమయంలో ఎదురుగా సిమెంట్ లోడ్‌తో వస్తున్న లా రీని వారి వాహనాన్ని ఢీకొంది. దీంతో వ్యాన్ ముందు భాగం నుజ్జనుజ్జయిపోయింది. ఈ ప్రమాదంలో మ ణి (39), కార్తి (30) డ్రైవర్ అరివళన్ (35), మైఖేల్‌రాజ్ (40) సంఘటనా స్థలంలోనే ప్రాణాలను కోల్పోయారు. స్థానికులు వచ్చి వ్యాన్‌లో చిక్కుకుపోయి, మృత్యువుతో పోరాడుతున్న వారిని కాపాడటానికి ప్ర యత్నించారు.
అదే సమయంలో రోడ్డుపై వెళుతున్న ఇతర వాహనాలచోదకులు వారిని బయటకు లాగేం దుకు సహకారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వ్యాన్‌లో చిక్కుకుపోయిన ఐదుగురిని 108 అంబులెన్స్‌లో ధర్మపురి ప్ర భుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరిన కొన్ని నిమిషాలకే హంసరాజ్ (25) మరణించారు. కత్తాన్ దురై, గోవిందస్వామి, రాములకు వైద్యం అందిస్తున్నా రు. వీరిలో కత్తాన్‌దురై పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. మృతి చెందిన ఐదుగురిని శవ పరీక్ష నిమిత్తం అదే ఆస్పత్రిలో ఉంచారు. లారీ డ్రైవర్ ఎం.జి.ఆర్‌ను అరెస్టు చేశారు. వాహనాలు ఢీకొనడంతో రాకపోకలు స్తంభించిపోయూరుు. పోలీసులు వెంటనే ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
మృత్యువులోనూ విడదీయని బంధం
తిరువణ్ణామలై వెళ్లి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కో ల్పోయిన ఐదుగురు ప్రాణ స్నేహితులు, ప్రతి ఏటా తి రువణ్ణామలై వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం వారి సంప్రదాయం. కానీ ఈ ఏడు జరిగిన దుర్ఘటనలో ఐదుగురు ఒక్కసారిగా మృత్యువాత పడడం ఆ గ్రామ ప్రజలను విషాదంలో ముంచివేసింది.
మమ్మల్ని ఆదుకోండి
తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కార్తి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చిన కలె క్టర్‌ను వేడుకున్నారు. కార్తికి 11 నెలల క్రితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. ఇతడిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు దిక్కులేకుండా పోయింది.