ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం.. క్షణాల్లో | Biker Rams Into On Scooter Crossing Road Tamil Nadu Dharmapuri | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. క్షణాల్లోనే..

Published Sat, Nov 21 2020 4:47 PM | Last Updated on Sat, Nov 21 2020 7:13 PM

Biker Rams Into On Scooter Crossing Road Tamil Nadu Dharmapuri - Sakshi

చెన్నై: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటిపై వెళ్తున్న యువతి రోడ్డు దాటే క్రమంలో యాక్సిడెంట్‌కు గురైంది. ఆ సమయంలో తనతో ఓ పాప కూడా ఉంది. అత్యంత వేగంగా దూసుకొచ్చిన బైకర్‌ వారిని ఢీకొట్టడంతో ఇద్దరూ గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. బైకర్‌ సైతం తీవ్రగాయాల పాలయ్యాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు వీరిని కాపాడేందుకు ముందుకు వచ్చారు. (చదవండి: రోడ్డు ప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం)

కాగా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గురైన ముగ్గురు మైనర్లే కావడంతో వారి తల్లిదండ్రులను పిలిపించి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ధర్మపురి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం అవి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.(చదవండి: మహిళా ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement