
సాక్షి, చెన్నై: తమిళనాడులో శనివారం ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధర్మపురి - సేలం మార్గంలో అతి వేగంతో వచ్చిన లారీ బీభత్సం సృష్టించింది. సిమెంట్ లోడ్‌తో వెళుతున్న లారీ అదుపు తప్పి వాహనాలపై దూసుకు వెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు 15 వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆ మార్గంలో పూర్తిగా ట్రాఫిక్ స్తంభించింది. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. గాయపడినవారిని సేలం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా , సినిమా షూటింగ్‌ను తలపించేలా ఉన్న ఆ దృశ్యాలు చూపురులను గగుర్పాటుకు గురి చేశాయి. పలు వాహనాలు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యాయి.





Comments
Please login to add a commentAdd a comment