'ధర్మపురి ఓ ఆధ్యాత్మిక కేంద్రం'
ధర్మపురి : కరీంనగర్ జిల్లా ధర్మపురి ఆధ్యాత్మిక కేంద్రమని పంబ పీఠాధిపతి గోవిందానంద సరస్వతి శర్మ పేర్కొన్నారు. ధర్మపురి పుణ్యక్షేత్రంలో పుష్కర స్నానం ఆచరించిన అనంతరం ఆయన తన ప్రవచనామృతాన్ని అందించారు. పుష్కర స్నానం చేయడం పూర్వ జన్మ సుకృతమన్నారు. వరుణుడి కరుణ కోసం దేవుడిని ప్రార్థించామన్నారు.