తెలంగాణలో గోదావరి పుష్కరాల పనులను సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ అనుచరులకే అప్పగించారని, దాంతో వారు పనులను నాసికరంగా పూర్తి చేశారని నిజామాబాద్ మాజీ ఎంపీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కి ఆరోపించారు.
ధర్మపురి (కరీంనగర్) : తెలంగాణలో గోదావరి పుష్కరాల పనులను సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ అనుచరులకే అప్పగించారని, దాంతో వారు పనులను నాసికరంగా పూర్తి చేశారని నిజామాబాద్ మాజీ ఎంపీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కి ఆరోపించారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా వెళ్లి గోదావరి నదిలో పుష్కరస్నానం ఆచరించారు.
అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన పుష్కర ఘాట్ పనుల్లో నాణ్యత లోపించిందన్నారు. భక్తులకు తాగునీరు, రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం, అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని విమర్శించారు.