ధర్మపురి : కరీంనగర్ జిల్లా ధర్మపురిలో ఉదయం 11 గంటల వరకు లక్షకు పైగా భక్తులు పుష్కర స్నానం ఆచరించారని అధికారులు తెలిపారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ధర్మపురిలోని పుష్కర ఘాట్ వద్ద బుధవారం పుష్కర స్నానం చేశారు. త్రివేణి సంగమం క్షేత్రం కాళేశ్వరానికి రెండో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తిరుగు ప్రయాణమైన భక్తులకు ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి. అయితే భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.