సాక్షి, ధర్మపురి : వెల్గటూరు మండలం తాళ్లకొత్తపేట గ్రామంలో శనివారం మరో ఆన్‌లైన్ మోసం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పొన్నం అనిల్‌కు ‘మీకు ఆన్‌లైన్‌లో జే 7 ఫోన్ ఆఫర్ వచ్చింది. రూ.1800 చెల్లించి ఫోన్ తీసుకోవాలని ఓ అమ్మాయి పదిరోజుల నుంచి ఫోన్‌చేసి విసిగిస్తోంది. అనుమానం వచ్చిన అతడు మొదట ఫోన్ వద్దని తప్పించుకున్నాడు. అయినా వదలకుండా ‘నీకు ఫోన్ పోస్టులో వచ్చిందని, తక్కువ ధరకు వచ్చిన ఫోన్‌ను ఎందుకు వదిలేస్తున్నావని, ఫోన్‌తో పాటు జియోసిమ్, ఆరునెలల పాటు నెట్, కాల్స్ ఉచితంగా వస్తాయని’ మభ్యపెట్టారు. దీంతో అనిల్ పోస్ట్‌మాన్‌కు రూ.1800 చెల్లించి పార్సల్‌ను తీసుకున్నాడు. తెరిచి చూడగా అందులో రూ.20 కూడా ఖరీదు చేయని ధనలక్ష్మీ యంత్రం ఉంది. తాను మోసపోయానని తెలుసుకుని సదరు నంబరుకు ఫోన్ చేస్తే పొంతన లేని సమాధాలు వచ్చాయి. ఎండపెల్లి ఘటన మరిచిపోక ముందే ఇది జరుగడం మండలవాసులను విస్మయానికి గురి చేస్తోంది. యువకులు అపరిచితుల ఆఫర్స్‌కు ఆశపడి మోసపోవద్దని వెల్గటూరు పోలీసులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment