కరీంనగర్ జిల్లా ధర్మపురి సహకార బ్యాంకులో గత అర్థరాత్రి భారీ చోరీ చోటు చేసుకుంది. బ్యాంక్ లాకర్ల నుంచి రూ.23 లక్షల విలువైన బంగారు నగలు మాయమైనాయి. అలాగే రూ. 2.68 లక్షల నగదును దొంగలు దోచుకుపోయారు. బ్యాంక్లో చోరీ జరిగిందని బ్యాంక్ అధికారులు బుధవార గుర్తించారు. దాంతో అధికారులు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. బ్యాంక్ లాకర్లతోపాటు చోరీ జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాంక్ వద్ద భద్రత సిబ్బంది లేకపోవడం వల్లే చోరీ జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా బ్యాంక్లోని సీసీ కెమెరా ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు.