కరీంనగర్(ధర్మపురి): కరీంనగర్ జిల్లా ధర్మపురికి పుష్కర స్నానం కోసం కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి శనివారం రాత్రి ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. బాలాపూర్‌కు చెందిన కర్నాటి అశోక్(42) తన భార్య సునీత, ఇద్దరు పిల్లలతో కలిసి రాత్రి 9.30 గంటల సమయంలో ధర్మపురి చేరుకున్నాడు. బస్టాండ్ సమీపం నుంచి గ్రామపంచాయతీ నందిచౌరస్తా వద్దకు చేరుకుని అక్కడ ఉన్న ఫెన్సింగ్‌కు ఒరిగాడు. ఫెన్సింగ్‌కు అమర్చిన విద్యుత్ దీపాలకు చెందిన వైరు దెబ్బతినడంతో పాటు వర్షంతో తడిసి ఉండటంతో అశోక్ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికి ఫలితం లేకపోవటంతో రాత్రి 10 గంటలకు మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ నీతూప్రసాద్ సందర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అశోక్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
గుండెపోటుతోటుతో వృద్ధుడు..
ధర్మపురికి పుష్కర స్నానాల కోసం వచ్చిన ఓ వృద్ధుడు శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం నాచారం గ్రామానికి చెందిన అనుగుల వెంకటిగౌడ్(70) బంధువులతో కలిసి వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో పుష్కరస్నానం కోసం ఘాట్ వద్దకు వెళ్లిన సమయంలో గుండెనొప్పితో కుప్పకూలిపోయూడు. బంధువులు వెంటనే ఆయనను వైద్యశిబిరానికి తరలించారు. అప్పటికే వెంకటిగౌడ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
పుష్కరాల్లో మరో ఇద్దరు మృతి
Published Sun, Jul 19 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM
Advertisement