కరీంనగర్ జిల్లా ధర్మపురి పట్టణంలోని బస్టాండు చుట్టూ ఉన్న దుకాణాలు బుధవారం వేకువజామున జరిగిన అగ్ని ప్రమాదంలో కాలి బుడిదయ్యాయి.
కరీంనగర్: కరీంనగర్ జిల్లా ధర్మపురి పట్టణంలోని బస్టాండు చుట్టూ ఉన్న దుకాణాలు బుధవారం వేకువజామున జరిగిన అగ్ని ప్రమాదంలో కాలి బుడిదయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక దుకాణంలో మంటలు చెళరేగి క్షణాల్లో పరిసర దుకాణాలకు వ్యాపించాయి. వేకువ జాము కావడంతో జన సంచారం లేదు. మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.50 లక్షల దాకా ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.