కరీంనగర్ జిల్లా ధర్మపురిలో మంగళవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా ధర్మపురిలో మంగళవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బస్టాండ్ సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్లో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పారు. అగ్నిప్రమాదంలో 16 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. మరో ఏడు దుకాణాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దాదాపు రూ. 50 లక్షలకుపైగా ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.