వెల్గటూరు: కరీంనగర్ జిల్లా ధర్మపురిలోని సరస్వతీమాత ఆలయంలోని బాత్‌రూంలో గురువారం మూడురోజుల ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. బాత్‌రూంలో నుంచి శిశువు అరుపులు విన్న చుట్టుపక్కలవారు అక్కడికి వెళ్లి చూడగా శిశువు కనిపిం చింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ సంతోష్ సంఘటనాస్థలానికి వచ్చి శిశువును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించగా, వారు శిశుగృహకు తరలించారు. చూడగానే ముద్దొస్తున్న శిశువును వదిలించుకోవడానికి ఆ తల్లికి మనసెలా వచ్చిందోనని స్థానికులందరూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆడశిశువు కావడంతోనే వదిలేశారా.. లేక మరేవైనా కారణాలున్నాయూ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.