పడవ మునిగి ఇద్దరి గల్లంతు | 2 died in boat slept accident | Sakshi
Sakshi News home page

పడవ మునిగి ఇద్దరి గల్లంతు

Published Tue, May 2 2017 6:47 PM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM

2 died in boat slept accident

ధర్మపురి(జగిత్యాల జిల్లా): బుగ్గారం మండలం చిన్నాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. పడవ మునిగిపోయి ఇద్దరు గల్లంతయ్యారు. రాయకల్‌ మండలకేంద్రానికి చెందిన బొమ్మవేణి వెంకటేశ్‌(25), గాజుల రాజు(16) అనే ఇద్దరు చుట్టపు చూపుగా చిన్నాపూర్‌ గ్రామానికి చెందిన గట్టు శ్రావణ్‌ ఇంటికి వచ్చారు.

ఊరి చివర ఉన్న చెరువులో చేపలకు మందు వేద్దామని ముగ్గురూ కలిసి పడవలో చెరువులోకి వెళ్లారు. అయితే పడవ ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. శ్రావణ్‌ ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. మిగతా ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement