
‘రుద్రమదేవి’లో అతిథి పాత్రలో ఆకట్టుకున్న హీరో అల్లు అర్జున్ మరోసారి అతిథిగా కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. అశోక్ సెల్వన్, రితికా సింగ్ జంటగా విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో నటించిన ‘ఓ మై కడవులే’ తెలుగు రీమేక్‌లోనే అల్లు అర్జున్ అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్. విశ్వక్ సేన్ హీరోగా తెలుగు రీమేక్‌ను పీవీపీ సినిమా–శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించనున్నాయి.
తమిళ చిత్రంలో విజయ్ సేతుపతి దేవుడి పాత్ర చేశారు. తెలుగులో ఆ పాత్రను అల్లు అర్జున్ చేయనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే... ‘రేసు గుర్రం’లో అల్లు అర్జున్ ‘దేవుడా’ అంటూ అదో రకమైన స్టయిల్‌లో చెప్పడం అందర్నీ ఆకట్టుకుంది. మరి.. ఇప్పుడు ఈ రీమేక్‌లో అల్లు అర్జున్ దేవుడేనా? లేక వేరే నటుడు కనిపిస్తారా? అనేది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment