దేవుడు మనిషికి ఇచ్చిన శక్తి ఎంతో తెలుసా? | Has God Given All The Powers To Humans In Terms Of Science | Sakshi
Sakshi News home page

దేవుడు మనిషికి ఇచ్చిన శక్తి ఎంతో తెలుసా? సైన్సు పరంగా చూస్తే..

Published Mon, Dec 11 2023 10:23 AM | Last Updated on Mon, Dec 11 2023 10:31 AM

Has God Given All The Powers To Humans In Terms Of Science - Sakshi

మానవుడు శక్తి హీనుడనని డీలా పడిపోతాడు. ధనం,అధికారం లేదు కాబట్టి తాను పనిరానివాడిగా భావిస్తాడు. ఇక ఇంతే జీవితమని నిరాశ నిస్ప్రుహలకు స్థానం ఇచ్చి జీవితాన్ని చీకటి మయం చేసుకుంటాడు. ఏదో ఒకరోజు ఇక్కడ నుంచి వెళ్లాల్సిందే కదా అని తన ఆఖరి ఘడియ కోసం నిర్లిప్తంగా ఎదురు చూస్తాడు. నిజానికి ప్రతి వ్యక్తికి దేవుడు చాలా శక్తిని ఇచ్చాడు. ధనం, అధికారం, ప్రతిష్టా, మంచి వంశం అనేవి పక్కన పెట్టండి. ప్రతి మనిషికి స్వతహగా ఎంతో శక్తిని ఇచ్చాడు. దాన్ని గుర్తించం, తెలుసుకుని ప్రయోజనం పొందే యోచన చెయ్యం. నిజానికి సైన్సు పరంగా మనిషిక ఎంత శక్తి ఉందో తెలిస్తే షాకవ్వడం ఖాయం!. అదేంటో సవివరంగా తెలుసుకుందాం!.

మానవుని యొక్క మెదడులో 10 కోట్ల కణాలు ఉన్నాయి. మానవుని కంటిలో 13 కోట్ల చిన్న చిన్న రాడ్ కణములు, 70 లక్షల కోన్ కణములు, 3 లక్షల నరములతో కలుపబడి ఉన్నాయి. ఒక కన్ను తయారు చేయుటకు 2 లక్షల టెలివిజను ట్రాన్స్ మీటర్లు, 2 లక్షల టెలివిజను రిసీవర్లు కావలి. ఇక హార్మోన్స్‌లో 45కేలరీలు, మానవుని చెవిలో 15,000 కీలు ఉన్నాయి. శరీరం వద్దకు వస్తే ప్రతి మానవుని శరీరములో 1,00,000 మైళ్ళ పొడవైన రక్తనాళాలు ఉన్నాయి. ప్రతి క్షణమునకు 20 లక్షల కణాలు తయారవుతాయి.

గుండె దగ్గరకు వస్తే. మానవుని హృదయము నిముషానికి 72 సార్లు చొప్పున రోజుకు ఇంచు మించు 1,00,000 (ఒక లక్ష) సార్లు, సంవత్సరానికి 4 కోట్ల సార్లు ఎటువంటి విశ్రాంతి లేకుండా కొట్టుకొట్టుంది. మానవుని జీవిత కాలములో హృదయములోని ఒక చిన్న కండరము 30 కోట్ల సార్లు సంకోచ వ్యాకోచములు చేస్తాయి. మానవుని శరీరములోని రసాయన పదార్ధములన్నీ కొనాలి అంటే 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మనిషి చనిపోయాక అమ్మితే 6 రూపాయల 45 పైసలు వస్తాయి.

మనిషి నవ్వటానికి శరీరములో 17 కండరములు కోప్పడటానికి 43 కండరములు పనిచేస్తాయి. మనిషి చర్మంలో 46 మైళ్ళ పొడవైన నాడులు ఉన్నాయి. మనిషి శరీరములోని రక్తనాళములు అన్నీ ఒకదానికి ఒకటి జోడిస్తే 1,00,000 మైళ్ళ పొడవు ఉంటుంది. మానవుని నాలుక పైన రుచిని తెలుపటానికి 3000 రకాల బుడిపెలు ఉంటాయి ఆరోగ్యము కల మనిషి ఒకరోజులో 23000 సార్లు శ్వాస పీల్చును. మనిషి చేతివేళ్ళ చర్మము మీద ప్రతి చదరపు అంగుళానికి 3000 స్వేద గ్రంధులు ఉన్నాయి. మనిషి తలపై సగటున 1,00,000 వెంట్రుకలు ఉంటాయి. మానవుని పంటి దవడ 276 కేజీల కంటే ఎక్కువ బరువు ఆపగలదు. మానవుని శరీరములో 206 ఎముకలు కలవు. మనిషి జీవిత కాలములో 16,000 గాలన్ల నీరు తాగుతాడు, 35000 కిలోగ్రాముల ఫుడ్‌ని తింటాడు.

మనిషి నోటిలో రోజుకు 2 నుంచి 3 పాయింట్ల జీర్ణరసము ఏర్పడుతుంది . మనిషి జీవిత కాలములో గుండె 100 ఈత కోలనులు నింపగలిగిన రక్తము పంపు చేస్తుంది. మానవుని శరీరములో నాలుకయే బలమైన కండరము. మానవుని శరీరములో 100 ట్రిలియను కణములు ఉంటాయి. మానవుని మెదడులో 80% నీరు ఉంటుంది. మానవుని మెదడుకు నొప్పి తెలియదు. మానవుని శరీర బరువులో ఎముకుల వంతు 14% ఉంటుంది. మానవుని వ్రేళ్ల కొనలకు శరీర బరువును మొత్తము ఆపగల శక్తి ఉంటుంది. మానవుని ఎముకలు బయటికి గట్టిగాను లోపల మెత్తగాను ఉంటాయి. వీటిలో 75% నీరు ఉంటుంది.

ఒక్క తుమ్ము ఏకంగా..
తుమ్ము గంటకు వంద మైళ్ళ వేగముతో ప్రయాణిస్తుంది. చేతి వేలి గోళ్ళు కాలి వేళ్ల గొళ్ల కన్నా 4 రెట్లు తొందరగా పెరుగుతాయి. స్త్రీ గుండె పురుషుని గుండె కన్నా ఎక్కువ వేగముగా కొట్టుకుంటుంది. స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువ సార్లు కనురెప్పలు ఆర్పుతారు. రక్తం, నీరు కుడా వారికి 6 రెట్లు చిక్కగా ఉంటుంది. మానవుని మూత్రపిండములు నిముషానికి 1.3 లీటర్ల రక్తమును శుద్ది చేయును. రోజుకు 1.4 లీటర్ల మూత్రమును విసర్జిస్తాం. స్త్రీ శరీరములో 4.5 లీటర్ల రక్తము, పురుషుని శరీరములో 5.6 లీటర్ల రక్తము ఉంటాయి. మానవుని గుండె రక్తమును 9 మీటర్ల ఎత్తు వరకు చిమ్మకలిగిన శక్తి కలిగి ఉంటుంది. మానవుని శరీరములో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క ప్రాంతము కంటిలోని కరోన. ఒక ఎర్ర రక్త కణమునకు శరీరము మొత్తము చుట్టి రావటానికి 20 సెకన్ల సమయము పడుతుంది.

రక్తములోని ప్రతి చుక్క కుడా శరీరము చేత రోజుకి 300 సార్లు శుద్ది చేయబడుతుంది. మానవుని జుత్తు, చేతి గోళ్ళు చనిపోయిన తరువాత కుడా పెరుగుతాయి. మనిషి గొంతులో ఉండే హ్యోఇడ్ అనే ఎముక శరీరములోని వేరే ఏ ఎముకతోను అతుకబడి ఉండదు. మనిషి పుర్రె 10 సంవత్సరములకు ఒకసారి మారుతూ ఉంటుంది. మనిషి మెదడులోని కుడి బాగము శరీరములోని ఎడమ బాగమును, మెదడులోని ఎడమ బాగము శరీరములోని కుడి బాగమును అదుపు చేస్తుంది. మనిషి ఏమి తినకుండా 20 రోజులు, ఏమి త్రాగకుండా 2 రోజులు బ్రతుకును. మనిషి ముఖములో 14 ఎముకలు ఉంటాయి. మానవుని నాడి నిముషమునకు 70 సార్లు కొట్టుకుంటుంది. ప్రతి ఏడు రోజులకొకసారి శరీరములోని ఎర్ర రక్త కణములలో సగము మార్పిడి చేయబడతాయి.

కంటితో 2.4 మిలియన్ల..
మనిషి దగ్గినపుడు గాలి శబ్ద వేగముతో ప్రయాణము చేస్తుంది. ఆహారము నోటిలో నుంచి పొట్ట లోపలి చేరటానికి 7 సెకన్ల సమయము పడుతుంది. మనిషి శరీరములో దాదాపు  75% నీరు ఉంటుంది. మనిషి కంటితో 2.4 మిలియను కాంతి సంవత్సరముల దూరము (140,000,000,000,000,000,000 మైళ్ళు) చూడగలడు. అది సుమారుగా 528 మెగా పిక్సల్‌ లెన్స్‌కి సమానం. ఇంత గొప్పగా మనలను తయారుచేసిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉండటమే గాక మన శరీరీ అవయవాల ప్రాముఖ్యతను గుర్తించి ఆరోగ్యంగా ఉండేందుక ప్రయత్నించాలి. ఇదంతా విన్నారు కదా ఇప్పుడు చెప్పండి మనకు  ఏమి తక్కువగా ఉంది? . కాబట్టి అస్సలు నిరాశ , నిస్పృహను దరిచేరనీయొద్దు. గమ్యం చేరే వరకు ప్రయాణించండి. ఇక్కడకి కేవలం వచ్చి పోవడానికి రాలేదు. వెళ్లేలోపు ఏదోఒకటి  ఇచ్చి పోవడానికే వచ్చాము. బీ స్ట్రాంగ్‌.. ఏదైనా సాధించాలని పట్టుదలను పెంపొందించుకోండి. విజయం తథ్యం. 

(చదవండి: నమస్కారం అంటే..ఏదో యాంత్రికంగా చేసేది కాదు! ఎక్కడ? ఎలా? చేయాలో తెలుసుండాలి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement