సువార్త
పూర్వం ఊజు దేశంలో యోబు అనే యథార్థవంతుడున్నాడు. ఆయనకు భార్య, కుమారులు, కుమార్తెలు ఉన్నారు. పాడిపంటలు, సిరిసంపద గలవాడు.
ఒకరోజు దేవదూతలు దేవుని సన్నిధికి వచ్చారు. ఆ సమయంలో అపవాది/సైతాను కూడా ప్రత్యక్షపరచుకున్నాడు. దేవదూతలు మొదట వెళ్ళి΄ోగా సైతానుతో భగవంతుడు– నీవు ఎక్కడినుండి వచ్చావు? భూలోకంలో దోషరహితుడు, ధర్మాత్ముడైన నా సేవకుడైన యోబు అనే భక్తుణ్ణి చూశావా? అని అడగ్గా, ‘నీ సేవకుడైన యోబును భూసంచారంలో చూశాను. అతడు నిస్వార్థంగా మిమ్మల్ని సేవిస్తున్నాడా? మీరనుగ్రహించిన సకల సంపద, సంతానం, ఆస్తిపాస్తులపై కంచె వేశారు కాబట్టే, మీయందు భయభక్తులు కలిగి వున్నాడు’ అన్నాడు సైతాను. అందుకు దేవుడు నీవు మాత్రం అతనిపై చేయివేయొద్దు. అతని సంపదకు కారణమైన భూమి, సంతోషభరితులైన సంతానం నీ స్వాధీనంలో ఉంచాను కనుక అతని సహనాన్ని పరీక్షించు కోవచ్చునని సెలవిచ్చాడు దేవుడు.
అప్పుడు సైతాను, యోబు ఆస్తిపాస్తులను చూసే నాగలిని, ఎద్దులను, పొలము దున్నువాటినన్నిటినీ షబాయీయులు తోలుకొని΄ోయారని, వారు నీ సేవకులను కత్తితో పొడిచి చంపారని దూత వచ్చి చెప్పాడు. అతడి మాటలు పూర్తి కాకముందే వేరొకడు వచ్చి– ’అయ్యా! కుమార్లు, కుమార్తెలు, పెనుగాలికి ఇళ్లు కూలిపోయి చనిపోయారని చెప్పాడు. అప్పుడు యోబు పైకి లేచి నేలపై బోర్లాపడి దేవునికి దండం పెట్టి నేను దిగంబరిగానే నా తల్లిగర్భం నుండి వచ్చాను. ఆ విధంగానే వెళ్ళిపోతానన్నాడు. ఇంత సంభవించినా యోబు దేవుని దూషించలేదు... నేరం మోపలేదు.
మరలా దేవదూతలు, సైతాను దేవుణ్ణి దర్శించడానికి వచ్చారు. మొదట దేవదూతలు వెళ్ళి΄ోయాక సైతానుతో ‘‘నీవు నాతో అనవసరంగా యోబును నాశనం చేయించినా అతనిప్పటికీ నైతికత విడవలేదని అనగా, సైతాను దేహం కా΄ాడు చర్మం, ్ర΄ాణం కాపాడు ఆత్మ వున్నదన్నాడు. అందుకు ప్రభువు అతనిప్రాణం జోలికి వెళ్ళవద్దన్నాడు.
అంతట సైతాను దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయాడు. యోబుకు నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు వ్రణములతో నింపగా యోబు కురుపులను చిల్లపెంకుతో గోకుతున్నాడు. అంతట అతని భార్య – ‘‘నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్ము’’ అనెను. అందుకు యోబు – ‘‘మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా?’’ అంటూ... యోబు నోటి మాటతో నైనను పాపము చేయలేదు. తర్వాత మరొక రోజు తన ముగ్గురు మిత్రులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి దూషించారు. యోబు సమయోచితమైన ప్రత్యుత్తరమిచ్చాడు. కానీ దేవుణ్ణి పల్లెత్తు మాట దూషించలేదు.
ఒకానొకరోజు దేవుడు సుడిగాలిలో ప్రత్యక్షమై భక్త యోబుకు నష్టపోయిన దానికంటే అధికంగా సిరిసంపదలు, సంతానం, సంతోషం అనుగ్రహించాడు.
దేవుడు సర్వశక్తిమంతుడు, న్యాయవంతుడు, దేవుని దృష్టిలో ఏ మనుష్యుడు నీతిమంతుడు కాడు. శ్రమ అనేది పాప ఫలితమేకాక ప్రాయశ్చిత్తం కూడాను. కష్టాలలో, నిస్సహాయతలో దేవుని వైపు తిరగడం మానవ విజ్ఞతకు సంకేతం.
– కోట బిపిన్ చంద్రపాల్
Comments
Please login to add a commentAdd a comment