కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరు రోజుల అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాహుల్ మంగళవారం శాన్‌ఫ్రాన్సిస్కోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీని, అధికార బీజేపీని లక్ష్యంగా చేసుకుని మాటల దాడి చేశారు. భారత్‌లో దేవుడి కంటే ఎక్కువ తెలుసని భావించే వ్యక్తులు ఉన్నారని, ప్రధాని మోదీ కూడా ఆ కోవ కిందకే వస్తారని వ్యాఖ్యానించారు. ఆ వ్యక్తుల సముహం తమకు ప్రతిదీ తెలుసునని భావిస్తారు.
వారు చరిత్రకారులకు చరిత్రను, శాస్త్రవేత్తలకు సైన్స్, సైన్యానికి యుద్ధం వంటివి సమస్తం వివరించేయగల సమర్థులుగా భావిస్తుంటారని విమర్శించారు. అవసరమైతే దేవుడికి కూడా విశ్వంలో ఏ జరుగుతుందో వివరించేయగలరన్నారు. ఐతే ప్రపంచం చాలా పెద్దది. ఏ వ్యక్తికి సమస్తం తెలియదు. కానీ ఆయా వ్యక్తులు మాత్రం తమకే అన్ని తెలుసునన్న భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
ఈ వ్యాఖ్యలకు బీజేపీ నుంచి స్పందన రావడమే గాక తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడతూ.. రాహుల్ విదేశీ పర్యటనల్లో భారత్‌ని అవమానిస్తున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు. ప్రధాని మోదీని అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచం పెరుగుతున్న మన స్థాయిని అంగీకరిస్తున్న తరుణంలో భారత్‌ని కించపరిచే యత్నం చేస్తున్నారు.
మోదీ తన విదేశీ పర్యటనలో దాదాపు 24 మంది ప్రధానులను, ప్రపంచ అధ్యక్షులను కలుసుకున్నారు. 50 కి పైగా సమావేశాలు నిర్వహించారు. మోదీ అత్యంత ప్రజాదారణ కలిగిన నాయకుడు అని పలువురు ప్రపంచ నేతలు చెబుతున్నారు. సాక్షాత్తు ఆస్ట్రేలియా ప్రధాని మోదీని బాస్ అని సంభోదించారు. ఇవన్నీ చూసి జీర్ణించుకోలేక ఇలా వ్యాఖ్యానిస్తున్నారని కేంద్ర మంత్రి ఫైర్ అయ్యారు.
(చదవండి: భారత్ జోడో యాత్ర అడ్డుకునేందుకు ప్రభుత్వం శాయశక్తుల ప్రయత్నించింది)
Comments
Please login to add a commentAdd a comment