న్యూయార్క్: తనను హత్య చేసేందుకు జరిగే ప్రయత్నాలను దేవుడు అడ్డుకొని రక్షించాడని అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లిక్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తనపై జరిగిన దాడులను విఫలం చేసిమరీ దేవుడు కాపాడాడని పేర్కొన్నారు. ట్రంప్ న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.
‘నాపై జరిగిన హత్యా ప్రయత్నాలను దేవుడే విఫలం చేసి నన్ను బతికించాడు. అందుకే మళ్లీ మన దేశంలోకి మతాన్ని తిరిగి తీసుకురాబోతున్నాం. సుమారు 40 ఏళ్లలో న్యూయార్క్ స్టేట్‌ను గెలుచుకున్న మొదటి రిపబ్లికన్ అభ్యర్థి తానే అవుతాను. ఈ దాడులు నా సంకల్పాన్ని మరింత దృఢపరిచాయి. హత్యచేసే ప్రయత్నాలు నా సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయలేవు. నేను ఇక్కడకు రావడానికి కారణం.. ఈసారి ఎన్నికల్లో మనం న్యూయార్క్‌ను గెలవబోతున్నాం. చాలా ఏళ్ల తర్వాత రిపబ్లికన్‌లు నిజాయితీగా చెప్పడం ఇదే తొలిసారి. మనం గెలిచి చూపించబోతున్నాం.
న్యూయార్క్ ప్రజలకు నేను ఒక్కటే చెబుతున్నా.. ఇక్కడ రికార్డు స్థాయిలో నేరాలు జరుగుతున్నాయి. తీవ్రవాదులు, నేరస్థులు పెరుగుతున్నారు. ద్రవ్యోల్బణం ప్రజలన ఇబ్బందులకు గురిచేస్తుంది.వాటి నుంచి బారినుంచి బయటపడాలంటే డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేయండి’ అని అన్నారు. మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ దేవుడు, మతంపై వంటి అంశాల మీద చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక.. ఇటీవల ట్రంప్ ఫ్లోరిడా గోల్ఫ్ కోర్స్‌లోని గోల్ఫ్ ఆడుతుండగా.. ఓ దుండగుడు కాల్పులు జరపడానికి ప్రయత్నించగా సెక్యూరిటీ సర్వీసెస్ అప్రమత్తమైన ఆయన్ను రక్షించిన విషయం తెలిసిందే.
JUST IN - Trump: "God has now spared my life…. We’re going to bring back religion into our country"
pic.twitter.com/yJcTAJx1ts— Insider Paper (@TheInsiderPaper) September 18, 2024
Comments
Please login to add a commentAdd a comment