Anchor Srimukhi Shared Her Childhood Photos With Fans On Instagram - Sakshi
Sakshi News home page

ఈ ప్రముఖ యాంకర్‌ ఎవరో గుర్తుపట్టారా?

Published Wed, Feb 24 2021 6:14 PM | Last Updated on Wed, Feb 24 2021 8:07 PM

Anchor Sri Mukhi Shares Her Childwood Picture In Instagram - Sakshi

పలు టీవీ షోలతో యాంకర్‌గా అలరిస్తున్న శ్రీముఖి..తెలుగునాట దాదాపు అందరికి సుపరిచితురాలే. బుల్లితెర రాములమ్మగా తనదైన యాంకరింగ్‌తో అలరిస్తూనే అప్పుడప్పుడు ఆడియో లాంచ్‌ ఫంక్షన్లకు హోస్ట్‌గానూ అలరిస్తుంది. హీరోయిన్‌ అవ్వాలన్న లక్ష్యంతో  సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడుకు వెండితెర అంతగా కలిసి రాకపోయినా, బుల్లితెరపై మాత్రం ఫుల్‌ బిజీబిజీగా గడుపుతోంది. అయితే  సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి..రీసెంట్‌గా ఫ్యాన్స్‌తో మచ్చటించింది.

ఈ నేపథ్యంలో ఏవైనా సరదా ప్రశ్నలుంటే అడగాలంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయగా,  మీ చిన్నప్పటి ఫోటోను షేర్‌ చేయాండంటూ ఓ నెటిజన్‌ కోరడంతో శ్రీముఖి తన చిన్ననాటి ఫోటోను అభిమానులతో పంచుకుంది. ఇక ‘జులాయి', ‘నేను శైలజ', ‘జెంటిల్‌మన్' వంటి  చిత్రాలు శ్రీముఖికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఈ మధ్యే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. ‘లువీ’ అనే పేరుతో బ్యూటీ ప్రొడక్ట్స్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. తొలుత పర్‌ఫ్యూమ్స్‌ను ప్రవేశపెట్టి దశలవారీగా బ్యూటీ, గ్రూమింగ్, హెయిర్‌ కేర్‌ వంటి ఉత్పత్తులను లువీ స్టోర్లలో పరిచయం చేస్తామని చెప్పుకొచ్చింది. 

చదవండి : (ఓ మై గాడ్‌! ఇది మీకెక్కడ దొరికింది?: అనసూయ)
(నాని వెనుక దాక్కున్న ఆ హీరోయిన్‌ ఎవరు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement