తాచుపాముతో ఆటలాడుతున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా? | Manchu Lakshmi Childhood Photos Viral on Social Media - Sakshi
Sakshi News home page

తాచుపాముతో ఫోటోకు పోజులిచ్చిన ఈ చిన్నారిని గుర్తు పట్టారా?

Published Sun, Oct 8 2023 11:27 AM | Last Updated on Sun, Oct 8 2023 11:36 AM

She Is A Daughter Of Tollywood Senior Hero, Do You Guess This Actress - Sakshi

పై ఫోటోలో చేతిలో పాము పట్టుకొని ధైర్యంగా చూస్తున్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? సరే మీకోసం ఓ చిన్న క్లూ. ఆమె ఒక మల్టీ టాలెంటెడ్‌ నటి. యాంకర్‌, నిర్మాత, సింగర్‌, నటిగా.. అన్ని రంగాల్లోనూ రాణించింది. ఆమె తండ్రి ఓ సీనియర్‌ హీరో. ఆమెకు ఇద్దరు సోదరులు.. వాళ్లు కూడా హీరోలే. ఎస్‌.. మీరు ఊహించింది కరెక్టే. ఆమె మన మంచు లక్ష్మీనే.

సీనియర్‌ హీరో మంచు మోహన్‌ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. బహుముఖ ప్రజ్ఞతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తొలుత కొన్ని ఇంగ్లీష్‌ సీరియల్స్‌, టీవీ షోలు చేసిన లక్ష్మీ.. అనగనగా ఓ ధీరుడు(2011) సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది.

తొలి సినిమాతోనే నెగెటివ్‌ పాత్రలో నటించింది మెప్పించింది. ఆ తర్వాత హీరోయిన్‌గా దొంగలముఠా, ఊ కొడతారా, ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి, చందమామ కథలు, బుడుగు, దొంగాట తదితర సినిమాల్లో నటించింది. కొన్ని సినిమాలకు నిర్మాతగాను వ్యవహరించింది. నేడు(అక్టోబర్‌ 8) మంచు లక్ష్మీ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఆమె చిన్ననాటి ఫోటోలు  నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వైరల్‌ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement