సాక్షి, చెన్నై: డీఎంకే సినీ గ్లామర్లు ప్రచారానికి సిద్ధం అయ్యారు. నటి ఖుష్బు, నటుడు వాగై చంద్రశేఖర్ పర్యటన వివరాలను డీఎంకే ప్రకటించింది. డీఎంకే ఎంపీ, కరుణానిధి గారాలపట్టి కనిమొళి పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేశారు.
రాష్ట్రంలో డీపీఏ పేరుతో కూటమిగా డీఎంకే ఎన్నికల్లోకి వెళ్లిన విషయం తెలి సిందే. డీఎంకే 35 స్థానాల్లో, ఆ కూటమిలోని వీసీకే రెండు చోట్ల, ఇండియ యూనియన్ ముస్లిం లీగ్, మనిదనేయ మక్కల్ కట్చి, పుదియ నిధి కట్చిలు తలా ఓ చోట బరిలో దిగాయి. కూటమి అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రచారంలో దూసుకెళుతున్నారు.
పార్టీ అధినేత కరుణానిధి ప్రచారానికి సిద్ధమయ్యారు. తమ పార్టీలో ఉన్న నటీ, నటులను ఎన్నికల ప్రచారంలోకి పంపించేందుకు డీఎంకే అధిష్టానం సిద్ధం అయింది. అలాగే, తన గారాల పట్టి కనిమొళి సైతం ప్రచార బాట పట్టే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో వారి పర్యటనల వివరాలను డీఎంకే కార్యాల యం అన్నా అరివాళయం సోమవారం ప్రకటించింది. ప్రచారం నిమిత్తం ప్రత్యేక వాహనాలు సిద్ధం అయ్యాయి.
ప్రచార బాట: ఏప్రిల్ ఐదు నుంచి కనిమొళి తన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు. ఆ రోజు ఉత్తర చెన్నైలో ఆమె ప్రచారానికి శ్రీకారం చుడతారు. విరామం లేకుండా ఆమె పర్యటన 22వ తేదీ వరకు సాగనున్నది. ఏడో తేదీన కంచి, కడలూరు, చిదంబరం, 9న శ్రీ పెరంబతూరు, పదిన అర్కోణం, 11న తిరువళ్లూరు,12నవేలూరు, 13నఆరణి, 14న సేలం, 15న నామక్కల్, 16న ఈరోడ్, 17న దిండుగల్, 18న విరుదునగర్, 19న తెన్‌కాశి, 20న తూత్తుకుడి, 21న తిరునల్వేలి, 22న కన్యాకుమారిలో ఆమె పర్యటించనున్నారు.
నటి ఖుష్బు ఏప్రిల్ ఐదో తేదీన తిరుచ్చి నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ఆరున కరూర్, 7న ఈరోడ్, 8న నీలగిరి,9న పొల్లాచ్చి, 10న కోయం బత్తూరు,11న తిరుప్పూర్, 12న సేలం, 13న ధర్మపురం, 14న కృష్ణగిరి, 15న వేలూరు, 17న ఆరణి, 18న తిరువణ్ణామలై,19న కాంచీపురం,20 అరక్కోణం, 21న శ్రీపెరంబదూరు , 22న తిరువళ్లూరుల్లో ఖుష్బు ప్రచారం సాగునున్నది.
వాగై : ఏప్రిల్ ఒకటి నుంచి వాగై చంద్ర శేఖర్ ప్రచారం సాగనున్నది. తిరుచ్చిలో తన పర్యటనకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. రెండు దిండుగల్, మూడున శివగంగై, 4న రామనాథపురం, 5న మదురై, 6న తేని, 7న దిండుగల్, 8న కరూర్, 9న తంజావూరు, 10న మైలాడుతురై, 11న చిదంబరం, 12న పుదుచ్చేరి, 13న కడలూరు, 14న దక్షిణ చెన్నై, 15న సెంట్రల్ చెన్నై, 16న కాంచీపురం, 17న వేలూరు, 18న తిరువళ్లూరు, 19న తిరువణ్ణామలై , 20న ఆరణి, 21న విల్లుపురం, 22న శ్రీ పెరంబదూరుల్లో పర్యటించనున్నారు.
ప్రచారానికి కని, ఖుష్బు సిద్ధం
Published Mon, Mar 24 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM
Advertisement
Advertisement