Kanimoli
-
Kanimozhi Karunanidhi: రాజకీయ కవయిత్రి
కనిమొళి కరుణానిధి.. బహుముఖ ప్రతిభావంతురాలైన రాజకీయవేత్త, కవి, పాత్రికేయురా లు, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సభ్యురాలు. తూత్తుక్కుడి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. చురుకైన విద్యార్థి... కనిమొళి చిన్నప్పటి నుంచే చురుకైన విద్యార్థి. బాల్యంలో తండ్రితో పెద్దగా గడపలేకపోయినా.. ఆయనకు మాత్రం ప్రియమైన కూతురే. కనిమొళి పుట్టిన తరువాతే ముఖ్యమంత్రి పదవి దక్కడంతో అది ఆమె తెచి్చన అదృష్టమేనని కరుణానిధి భావించేవారు. తండ్రి తన దగ్గరలేని బాధను కనిమొళి కవిత్వంగా మలిచారు. అది చదివి ఆయన కదిలిపోయారు. అలా తండ్రీకూతుళ్లను సాహిత్యం మరింత దగ్గర చేసింది. కనిమొళి క్రియాశీల రాజకీయాలకు దూరంగా పెరిగారు. 2001లో జయలలిత హయాంలో కరుణానిధిని అరెస్టు చేసినప్పుడు తండ్రి పక్కన నిలబడి తొలిసారి ప్రముఖంగా బయటకు కనిపించారు. నాటినుంచీ ఆయన గళంగా మారిపోయారు. తండ్రి బహుముఖ ప్రజ్ఞకు కనిమొళి అప్రకటిత వారసురాలు. దానికి తోడు ఇంగ్లిష్ బాగా మాట్లాడతారు. దాంతో కరుణానిధి ఢిల్లీలో పెద్దలెవరినీ కలిసినా వెంట కనిమొళి ఉండేవారు. కనిమొళి ఢిల్లీ రాజకీయాల్లో, స్టాలిన్ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉండేలా కరుణానిధి ముందుచూపుతో వ్యవహరించారు. 1982లో జయలలిత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన వేదికపైనే 2008 జూన్‌లో కనిమొళితో డీఎంకే తొలి మహిళా సమ్మేళనం నిర్వహించారు. అలా ఆమెను అగ్రనాయకురాలిగా నిలబెట్టే ప్రయత్నాలు చేశారు. కనిమొళిని జయలలితకు కౌంటర్‌గా కరుణానిధి చూశారు. వారిద్దరికీ సారూప్యమూ ఉంది. ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుకున్నారు. జర్నలిస్టులుగా పనిచేశారు. రాజ్యసభ సభ్యులుగానే రాజకీయ జీవితం ప్రారంభించారు. రాజకీయాల్లో... కనిమొళి 2007లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. çఆరోగ్యం, కుటుంబ సంక్షేమ, విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి కమిటీ, హోమ్ వ్యవహారాల వంటి పలు కమిటీల్లో చురుగ్గా పనిచేసి ఆకట్టుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ జనరల్ అసెంబ్లీ సభ్యురాలిగా చేశారు. 2013లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2018లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. 2019లో తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. తూత్తుక్కుడి నుంచి బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్‌పై ఏకంగా 3,47,209 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సక్సెస్ఫుల్ జర్నలిస్టు.. కనిమొళి సక్సెస్ఫుల్ జర్నలిస్టు కూడా. ప్ర ముఖ ఆంగ్ల దినపత్రికలో సబ్ ఎడిటర్‌గా చేశా రు. తమిళ వారపత్రిక ‘కుంగుమం’ సంపాదకురాలిగా వ్యవహరించారు. సింగపూర్‌కు చెందిన ‘తమిళ మురసు’ వార్తాపత్రికకూ ఫీచర్స్ ఎడిటర్‌గా సేవలందించారు. తమిళంలో కవిత్వం రాశారు. తమిళ కవిత్వాన్ని ఇంగ్లి‹Ùలోకి అనువదించారు. ఆమె రచనలు ఇంగ్లి‹Ù, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లోకి అనువాదమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫేజ్ 2 @96 కూటముల కోలాటం
ఏడు దశల పోలింగ్‌లో రెండో దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలి ఘట్టంలో 91 స్థానాలకు పోలింగ్ జరగ్గా.. రెండో దశలో అంత కంటే కొంచెం ఎక్కువ అంటే.. 96 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌జరగనుంది. మొన్న 11న జరిగిన తొలిదశ పోలింగ్ శాతాన్ని బట్టి(తెలంగాణలో 8 శాతం, ఉత్తరాఖండ్‌లో నాలుగు శాతం తక్కువ)బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని.. మరోసారి అధికారం చేపట్టడం కల్ల అని కొందరు ఇప్పటికే లెక్కలు వేసినా.. వాస్తవం ఏమిటో తేలేది మే 23న మాత్రమే. ఏదెలా ఉన్నప్పటికీ రెండో దశ ఎన్నికలు మొత్తం కూటముల కుప్ప అని స్పష్టమవుతోంది. రాష్ట్రాల వారీగా ఇదీ పరిస్థితి.. తమిళనాట కుంపట్ల మంట దక్షిణాదిలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం తమిళనాడు. గత ఎన్నికల్లో నాలుగు కూటములు హోరాహోరీగా తలపడ్డాయిక్కడ. ఏఐఏడీఎంకే ఒకవైపు.. డీఎంకే, ఐయూఎంఎల్, వీసీకే ఒక కూటమి గా, బీజేపీ, డీఎండీకే, పీఎంకే, ఐజేకే, పీఎన్కే మరో కూటమిగా.. కాంగ్రెస్, వామపక్షాలు ఇంకో కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగాయి. దేశవ్యాప్తంగా వీచిన మోదీ హవాను అడ్డుకుని మరీ ఏఐఏడీఎంకే విజేతగా నిలిచింది. 39 స్థానాల్లో 44 శాతం ఓట్లు పోగేసుకుని 37 సీట్లు సాధించింది. మిగిలిన రెండింటినీ బీజేపీ, పీఎంకే పంచుకున్నాయి. రెండేళ్ల తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏఐఏడీఎంకే విజయఢంకా మోగించగా.. ఆ తరువాత కొద్దికాలానికే జయలలిత, కరుణానిధి కన్నుమూశారు. రాజకీయ శక్తుల పునరేకీకరణకూ ఆస్కారం కలిగింది. డీఎంకే పగ్గాలు కరుణ కుమారుడు ఎంకే స్టాలిన్‌కు దక్కగా.. ఏఐఏడీఎంకే వారసత్వం మాత్రం గందరగోళానికి దారితీసి, పార్టీ రెండు ముక్కులయ్యేలా చేసింది. ఎట్టకేలకు అధికార పంపిణీపై రాజీ కుదిరిన తరువాత కె.పళనిస్వామి, ఓపీఎస్ పన్నీర్ సెల్వమ్ వర్గాలు రెండూ ఒక్కటయ్యాయి. మరోవైపు జయలలిత సమీప బంధువు టీటీవీ దినకరన్ 18 మంది ఎమ్మెల్యేలతో అమ్మ మక్కళ్ మున్నేట్ర కజగం పేరుతో సొంత కుంపటి పెట్టారు. ఈ లోక్‌సభ ఎన్నికల తరువాత త్వరలో జరిగే 22 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు అటు దినకరన్ పార్టీకి, ఇటు ఏఐఏడీఎంకే మనుగడకూ కీలకంగా మారాయి. బరిలో నాలుగు కూటములు 2019 ఎన్నికల్లోనూ తమిళనాట చతుర్ముఖ పోటీ నెలకొంది. ఏఐఏడీఎంకే కాస్తా ఎన్డీయే పక్షాన చేరిపోగా.. డీఎంకే యూపీఏ వైపు నిలిచింది. సినీ నటుడు కమల్‌హాసన్ పార్టీ మక్కళ్ నీది మయ్యమ్, దినకరన్ పార్టీ కూడా బరిలో నిలిచాయి. ఏఐఏడీఎంకే 20 స్థానాల్లో పోటీ చేస్తుండగా, భాగస్వామ్య పక్షాలైన పీఎంకే (7), బీజేపీ (5), డీఎండీకే (4), తమిళ మానీల కాంగ్రెస్, తమిజగం కచ్చి, పుదియ నీది కచ్చి ఒక్కో సీటుకు పోటీ పడుతున్నాయి. పుదుచ్చేరి నుంచి మరో భాగస్వామ్య పార్టీ ఏఐఎన్ఆర్సీ పోటీ చేస్తోంది. మరోవైపు యూపీఏ కూటమిలో డీఎంకే 20, కాంగ్రెస్ 9 స్థానాల్లోనూ పోటీ చేస్తుండగా వీసీకే (2), సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే, ఐజేకే, కేఎండీకే, ఐయూఎంఎల్ ఒక్కో స్థానంలో పోటీలో ఉన్నాయి. డీఎంకే, ఏఐఏడీఎంకే 8 చోట్ల ముఖాముఖి తలపడుతున్నాయి. కాగా వేలూరు లోక్‌సభ ఎన్నిక చివరి నిమిషంలో వాయిదా పడింది. స్థానికాంశాలే ప్రచారాస్త్రాలు.. తమిళనాట ఎన్నికలు ప్రధానంగా స్థానిక అంశాల ఆధారంగానే జరుగుతుంటాయి. చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న కావేరీ నదీ జలాల వివాదంతోపాటు తూతుక్కుడిలో స్టెరిలైట్ కాపర్ స్మెల్టింగ్ ప్లాంట్ మూసివేత ఆందోళనలో జరిగిన కాల్పులు ప్రధానాంశాలుగా మారాయి. సేలమ్ –చెన్నై గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంపై పర్యావరణ వేత్తల నుంచి వస్తున్న అభ్యంతరాలు ఎన్నికలపై ప్రభావం చూపవచ్చు. ఈ ఏడాది జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సు, గాజా తుపాను విపత్తును సమర్థంగా ఎదుర్కోవడం, మదురైకు ఎయిమ్స్ రావడాన్ని తమ విజయాలుగా ఏఐఏడీఎంకే చెబుతోంటే.. సంక్షేమ పథకాల అమలులో వైఫల్యాలు. పరిపాలన కుంటుపడటాన్ని డీఎంకే ఎత్తి చూపుతోంది. అధికార పార్టీకి మంచి పట్టున్న దక్షిణ తమిళనాడు ప్రాంతంలో దీపావళి టపాకాయల ఫ్యాక్టరీలపై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించడంతో వేలాది మంది ఉపాధి కోల్పోగా 2017లో వచ్చిన ఓఖీ తుపాను కారణంగా 191 మంది జాలర్లు మరణించడం ఏఐఏడీఎంకే వైఫల్యాలుగా చూపుతోంది. అన్నిటినీ పరిశీలించిన తరువాత తమిళనాట ఈ దఫా ఎన్నికల్లో డీఎంకేకు ఎక్కువ సీట్లు దక్కవచ్చునని అంచనా. అయితే ఇవి 2004 నాటి స్థాయిలో ఉండవు. ఏఐఏడీఎంకే ఎన్డీయే కూటమి ప్రభావం ఉంటుంది. ఏఐఏడీఎంకే రెండంకెల స్థానాలు కైవశం చేసుకోవచ్చు. కీలక నియోజకవర్గాలు: చెన్నై సెంట్రల్: దయానిధి మారన్ (డీఎంకే) ధర్మపురి: సిట్టింగ్ ఎంపీ అన్బుమణి రామ్‌దాస్ పోటీ చేస్తున్నారు. నీలగిరీస్ (ఎస్సీ): బడగ (ఎస్టీ), అరుంధరియార్లు, వెల్లలా గౌండర్లు (ఓబీసీ) పెద్దసంఖ్యలో గల ఈ స్థానంలో ఏ.రాజా పోటీ చేస్తున్నారు. కోయంబత్తూరు: బీజేపీ, సీపీఎం మధ్య ఇక్కడ ప్రత్యక్ష పోరు నెలకొంది. శివగంగ: కార్తి (కాంగ్రెస్)–హెచ్.రాజ (బీజేపీ) పోటీలో ఉన్నారు. తూతుక్కుడి: కరుణానిధి కుమార్తె కనిమొళి (డీఎంకే), తమిళసాయి సౌందరరాజన్ (బీజేపీ) పోటీ పడుతున్న స్థానమిది. కన్యాకుమారి: పొన్ రాధాకృష్ణన్ (బీజేపీ), హెచ్.వసంతకుమార్ (కాంగ్రెస్) మధ్య ప్రత్యక్ష పోరు.. హిందువులు, క్రిస్టియన్లు సమానంగా ఉన్నారిక్కడ. మహారాష్ట్రలో ఎవరు ‘పది’లం? మహారాష్ట్రలో పది లోక్‌సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఈ పది స్థానాల్లో.. గత ఎన్నికల్లో బీజేపీ, శివసేన తలో నాలుగు సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజేతగా నిలిచింది. ప్రభావం చూపే అంశాలివే.. ►కరువుకు మారుపేరుగా నిలిచే మరాఠ్వాడ ప్రాంతంలో వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు ఈ ఎన్నికల్లో కీలకాంశాలుగా మారాయి. ►వ్యవసాయ సంక్షోభం, తాగునీటి లభ్యత, నిరుద్యోగం, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటిని కాంగ్రెస్, వీబీఏ ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నాయి. పోటీ.. నువ్వా?నేనా? ►బీజేపీ నేత ప్రీతమ్ ముండే పోటీ చేస్తున్న బీడ్ నియోజకవర్గంలో పోటీ ఉత్కంఠ కలిగిస్తోంది. ►దశాబ్దాలుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న లాతూర్‌లో మచ్చీంద్ర కామత్.. సుధాకర్ శ్రాంగరే (బీజేపీ) మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. వారానికి ఒక్కసారి మాత్రమే తాగునీరు దొరికే లాతూర్‌లో నీటి లభ్యతే ముఖ్యమైన ఎన్నికల అంశం. ►షోలాపూర్‌లో కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే (కాంగ్రెస్), లింగాయత్ వర్గ మఠాధిపతి మహాస్వామి జై సిద్ధేశ్వర్ శివాచార్య (బీజేపీ), అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ (వీబీఏ) మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. దాదాపు నాలుగు లక్షల ఓట్లు ఉన్న లింగాయత్‌లు తమ విజయానికి అక్కరకొస్తారని బీజేపీ ఆశిస్తుండగా మూడు లక్షల మంది ధంగర్లు, 2.50 లక్షల ముస్లింలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రకాశ్ అంబేడ్కర్ ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలు జరిగే స్థానాలు: విదర్భ ప్రాంతంలోని బుల్దానా, అకోలా, అమ్రావతి (ఎస్సీ), మరాఠ్వాడ ప్రాంతంలోని హింగోలి, నాందేడ్, పర్బని, బీడ్, ఒస్మానాబాద్, లాతూర్, రాష్ట్ర పశ్చిమ ప్రాంతంలోని షోలాపూర్. ‘ఉత్తరాది’ వస్తాదులెవరో? దేశంలోనే అతి ఎక్కువ లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో గురువారం రెండో దశ పోలింగ్ జరగనుంది. ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరగనుండగా, గత ఎన్నికల్లో ఈ ఎనిమిదింటినీ బీజేపీ గెలుచుకుంది. బాలాకోట్ దాడుల తరువాత జరుగుతున్న ఈ ఎన్నికలు కాషాయ పార్టీకి మేలు చేసే అవకాశాలున్నాయి. అయితే ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ పొత్తు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్న కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో యూపీ ఎన్నికలు మతం రంగు పులుముకున్నాయి. ముస్లింలు అందరూ తమ సెక్యులర్ కూటమికి ఓటేయాలన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి పిలుపు విమర్శలకు తావిచ్చింది. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘అలీ వర్సెస్ బజరంగభళి’ వ్యాఖ్య.. ఎన్నికల కమిషన్ ఆయనపై మూడు రోజుల ప్రచార నిషేధాన్ని ప్రకటించేందుకు కారణమైన విషయం తెలిసిందే. మతాల ప్రాతిపదికన జరుగుతున్న ఈ ఎన్నికలు కూటమి లెక్కలను తారుమారు చేసే అవకాశముంది. అలాగే, ఈ ఎనిమిది స్థానాల్లో బీజేపీ ఈసారి కొన్నిటిని కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీల మధ్య పొత్తులు పనిచేస్తే.. బీజేపీకి నష్టమే. ►అలీగఢ్‌లో బీజేపీ ఎంపీ సతీశ్ కుమార్ గౌతమ్, బీఎస్పీ అభ్యర్థి అజిత్ బలియాన్, కాంగ్రెస్ అభ్యర్థి బిజేంద్ర సింగ్ మధ్య ముక్కోణపు పోటీ నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో ముస్లింలు దాదాపు 20 శాతం మంది ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి ముస్లింలు ఎప్పుడూ గెలుపొందకపోవడం గమనార్హం. 2014లో దళిత, జాఠ్, లోధ్ సామాజిక వర్గాల మద్దతుతో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. ►ఆగ్రాలోనూ బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండగా.. మథురలో సినీ నటి హేమామాలిని బరిలో ఉన్నారు. ఎన్నికలు జరిగే స్థానాలు: నగీనా (ఎస్సీ), అమ్రోహా, పశ్చిమ యూపీలోని అలీగఢ్, హత్రాస్ (ఎస్సీ), మథుర, ఆగ్రా (ఎస్సీ), ఫతేపూర్ సిక్రీ, బులంద్‌షహర్. అస్సాం, బిహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్.. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంతోపాటు బిహార్, ఒడిశాలోనూ రెండో దశ ఎన్నికల్లో భాగంగా ఐదేసి స్థానాలకు ఈ నెల 18న పోలింగ్ జరగనుంది. అస్సాంలో.. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ రాకతో ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. 2014 డిసెంబర్ 31వ తేదీని కటాఫ్‌గా పెట్టి హిందూ, పార్శీ, బౌద్ధులు, జైన్, సిక్కులను అక్రమ వలసదారులుగా గుర్తించేందుకు ఉద్దేశించిన సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ బిల్ (2016) కూడా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశముంది. అనేక ప్రదర్శనలు, ఆందోళనల తరువాత ఇప్పుడు పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్నా ఈ అంశాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ►బిహార్ తూర్పు ప్రాంతంలోని కిషన్‌గంజ్, కథిహార్, పూర్ణియా, భగల్పూర్, బంకా స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ►ఒడిశాలో బార్‌బాగ్, సుందర్‌గఢ్ (ఎస్టీ), బోలన్‌గిర్, కాంధమాల్, అస్కా పోలింగ్‌కు సిద్ధమయ్యాయి. 2014లో బీజేడీ నాలుగు, బీజేపీ ఒక స్థానం గెలుచుకున్నాయి. ఈసారి బోలన్‌గిర్, అస్కాలలో బీజేపీ, బీజేడీ మధ్య హోరాహోరీ నడుస్తోంది. 1999 నుంచి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గెలుస్తూ వస్తున్న అస్కా నియోజకవర్గంలో ఈసారి ఆ పార్టీ సీనియర్ రామకృష్ణ పట్నాయక్, కాంగ్రెస్ కార్యకర్తల మద్దతుతో రామకృష్ణ పాండా (సీపీఎం) పోటీ చేస్తున్నారు. ►ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్లో మూడేసి స్థానాలకు, జమ్మూ కశ్మీర్లో రెండు, మణిçపూర్, త్రిపురలో ఒక్కో స్థానం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఒక స్థానానికి కూడా గురువారమే పోలింగ్ జరగనుంది. రక్తి కట్టిస్తోన్న‘కర్ణాటక’ం కర్ణాటకలో ఈసారి ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. ఈ నెల 18న జరిగే తొలిదశలో రాష్ట్రంలోని మొత్తం 28 నియోజకవర్గాల్లో సగం స్థానాలకు పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ముక్కోణపు పోటీ జరగ్గా మోదీ హవాతో బీజేపీ 17 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ ఎనిమిది, జేడీఎస్ రెండు స్థానాలు గెలుపొందాయి. 2004 నుంచి బీజేపీ ఆధిపత్యం సాధిస్తున్న ఈ రాష్ట్రంలో గత ఏడాది తృటిలో అధికారం కోల్పోయింది. ఫలితాలు వెలువడ్డాక కాంగ్రెస్ జేడీఎస్ జట్టుకట్టడంతో బీజేపీ ప్రతిపక్షంగా నిలవాల్సి వచ్చింది. తాజా ఎన్నికల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ 18 స్థానాల్లోనూ, జేడీఎస్ పది స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ –జేడీఎస్ కూటమి.. రైతు రుణమాఫీ, ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు అధిష్టానానికి డబ్బులిచ్చానన్న బీఎస్ యడ్యూరప్ప ఆడియో టేపులు బీజేపీని ఇరుకున పెడుతుండగా.. దేశ భద్రత, దేశభక్తి, నరేంద్ర మోదీ శక్తియుక్తుల ఆధారంగా బీజేపీ ఓట్లు అడుగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ –జేడీఎస్ ఉమ్మడి ఓట్లు పది శాతం వరకూ ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈసారి కూటమికి 17–20 స్థానాలు దక్కాలి. అయితే భాగస్వామి పక్షాల్లోని లుకలుకలు, ఓట్ల బదలాయింపు, కార్యకర్తల మధ్య సమన్వయం తదితర అంశాలన్నీ తుది ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి. ►18న జరిగే ఎన్నికల్లో చామరాజ నగర... సినీనటి సుమలత పోటీ చేస్తున్న మండ్య స్థానాలు కీలకంగా ఉన్నాయి. ►మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేస్తున్న హాసన్, దేవెగౌడ స్వయంగా బరిలోకి దిగుతున్న తుముకూరు కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. లింగాయతులు, ఒక్కళిగలు సమాన సంఖ్యలో ఉన్న తుముకూరులో సిట్టింగ్ ఎంపీ ఎస్.పి.ముద్ద హనుమేగౌడ (కాంగ్రెస్) తిరుగుబాటు చేయడం దేవెగౌడ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపే అవకాశముంది. ఎన్నికలు జరిగే స్థానాలు: బెంగళూరులోని నాలుగు స్థానాలతో పాటు తీర ప్రాంతంలోని ఉడుపి చిక్కమగళూరు, దక్షిణ కన్నడ స్థానాలు, హాసన్, చిత్రదుర్గ, తుముకూరు, మండ్య, మైసూరు, చామరాజనగరలు, రాష్ట్ర దక్షిణ ప్రాంతంలోని చిక్కబళ్లాపుర, కోలార్ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. 2014 ఎన్నికల్లో.. ఎవరికెన్ని? ►33 ఎన్డీఏ (బీజేపీ–27, భాగస్వామ్య పార్టీలు–6) ►15యూపీఏ (కాంగ్రెస్–12, భాగస్వామ్య పార్టీలు–3) ►02 వామపక్షాలు ►37ఏఐఏడీఎంకే ►10ఇతరులు -
ప్రాంతీయ పార్టీలదే హవా
సాక్షి, హైదరాబాద్/చెన్నై: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకన్నా ప్రాంతీయ పార్టీలే ఎక్కువ ఓట్లు సాధిస్తాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించాలన్నది తన ఆకాంక్ష అని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్న కేసీఆర్.. చెన్నైలో రెండోరోజు రాజ్యసభ సభ్యురాలు, డీఎంకే నాయకురాలు కనిమొళితో సమావేశమయ్యారు. సోమవారం మధ్యాహ్నం సీఎం బస చేసిన ఐటీసీ చోళ హోటల్లో వీరిరువురి భేటీ జరిగింది. ఈ సందర్భంగా దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై దాదాపు గంటపాటు చర్చించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే సమైక్య స్ఫూర్తి పరిఢవిల్లుతుందని కేసీఆర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను కనిమొళి అభినందించారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలు మరింత ఐక్యంగా పని చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, భూరికార్డుల ప్రక్షాళన, ఎకరానికి రూ.8 వేల చొప్పున రైతులకు పెట్టుబడి అందించే పథకాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కనిమొళికి వివరించారు. త్వరలో హైదరాబాద్ వస్తానని, కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టును చూస్తానని ఆమె ఈ సందర్భంగా సీఎంకు చెప్పారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బి.వినోద్‌కుమార్, విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చెన్నై పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆదివారం డీఎంకే అధినేత కరుణానిధి, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. జాతీయ రాజకీయాలపై చర్చించాం.. కేసీఆర్‌తో భేటీ అనంతరం కనిమొళి మీడియాతో మాట్లాడారు. జాతీయ రాజకీయాలపై చర్చించామని, రానున్న సార్వత్రిక ఎన్నికలపై తాను కూడా ఆసక్తిగా ఉన్నట్టు చెప్పారు. మరోవైపు కేసీఆర్‌తో వచ్చిన మంత్రులు బృందాలుగా ఏర్పడి సోమవారం ఉదయం చెన్నైలో పలు ప్రాంతాల్లో పర్యటించినట్టు సమాచారం. ఆయా ప్రాంతాల్లో రోడ్లు, ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతోపాటు అధ్యయనం చేసినట్టు తెలిసింది. రేపు అఖిలేష్ రాక? ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బుధవారం హైదరాబాద్ రానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఇటీవల పార్టీ ప్లీనరీలో సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్లీనరీకి ఒక రోజు ముందే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లక్నోలో అఖిలేష్ యాదవ్‌ను కలుసుకున్నారు. -
వారి అంతర్గత రాజకీయాల్లో మేం జోక్యం చేసుకోం
-
కనిమొళికి రాహుల్ గాంధీ ఫోన్
చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్ధితి గురించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలుసుకున్నారు. డీఎంకే నేత కనిమొళికి ఫోన్ చేసిన రాహుల్.. కరుణానిధి ఆరోగ్యంపై ఎంక్వైరీ చేశారు. కాగా, అలెర్జీ, శ్వాసకోశ సమస్యలతో గురువారం ఉదయం కరుణానిధి కావేరి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. కరుణానిధి అలెర్జీ సమస్యతో ఇబ్బందిపడుతున్నారని ఆయనకు కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించాలని పేర్కొంది. కరుణానిధి ఆసుపత్రిలో చేరడంతో డీఎంకే నేతలు ఒక్కసారిగా ఆసుపత్రికి క్యూ కట్టారు. దీనిపై స్పందించిన డీఎంకే నేత స్టాలిన్ నేతలెవరూ ఆసుపత్రికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. కరుణానిధి ఆరోగ్యం బాగానే ఉన్నారని చెప్పారు. -
అధికారంలోకి రాగానే మద్యనిషేధం
వేలూరు: డీఎంకే పార్టీ అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని ఆ పార్టీ ఎన్నికల సమావేశం కార్యదర్శి కనిమొళి తెలిపారు. తిరువణ్ణామలైలో మహిళా విభాగం కార్యకర్తల సమావేశం జిల్లా కార్యదర్శి ఏవావేలు అధ్యక్షతన జరిగింది. కనిమొళి మాట్లాడుతూ అన్నాడీఎంకే ప్రభుత్వంలోనే రాష్ట్ర వ్యాప్తంగా టాస్మాక్ దుకాణాలు అధిక మయ్యాయన్నారు. అదే విధంగా ఐదు సంవత్సరాల్లోనే అధికంగా ప్రమాదాలు జరగడంతో మహిళలు అధికంగా వితంతువులుగా మారారన్నారు. కరుణానధి గతంలో మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత కరుణానిధికే దక్కిందన్నారు. రానున్న ఎన్నికల్లో డీఎంకే పార్టీ విజయం సాధించడం ఖాయమని ఇందుకు కార్యకర్తలందరూ ఏకమై కష్టపడి పనిచేయాలన్నారు. పార్టీ అధిష్ఠానం ఎవరిని గుర్తించి సీటు కేటాయించినా అభ్యర్థి కోసం కష్ట పడకుండా పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు. పార్టీలో వర్గ బేధాలు లేకుండా ఏకమై సైనికుల్లా పనిచేయగలిగితే విజయం మనవైపే ఉంటుందన్నారు. రాష్ర్టంలోని ప్రజలు అన్నాడీఎంకే ప్రభుత్వంపై విరక్తితో ఉన్నారన్నారు. రాష్ర్టంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కరుణానిధిని ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళా విభాగం కార్యదర్శి విజయలక్ష్మి, తూర్పు జిల్లా కార్యదర్శి లక్ష్మి, జిల్లా కార్యదర్శి శివానందం, మాజీ పార్లమెంట్ సభ్యులు వేణుగోపాల్, మహిళా విభాగం కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
‘కని’సేన సిద్ధం
* అన్నబాటలో సోదరి * జిల్లాల వారీగా కమిటీలు * ఇక ప్రజల్లోకి అన్నయ్య స్టాలిన్ బాటలో ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు డీఎంకే మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కనిమొళి సిద్ధమయ్యారు. జిల్లా మహానగర, నగర, యూనియన్లలో మహిళా విభాగాల నేతృత్వంలో కార్యక్రమాలను విస్తృతం చేయనున్నారు. ఇందుకు జిల్లాల వారీగా ప్రత్యేక కమిటీలను ప్రకటించారు. సాక్షి, చెన్నై : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టాలన్న కాంక్షతో డీఎంకే అధినేత ఎం.కరుణానిధి వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. ప్రతిపక్షాలు తమతో కలసి వచ్చే అవకాశాలు కన్పించని దృష్ట్యా ఒంటరిగానై నా ఎన్నికలను ఎదుర్కొనే దిశగా ముందుకు సాగుతున్నారు. ప్రజాకర్షణ దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ దళపతి, కోశాధికారి ఎంకే స్టాలిన్ మనకు...మనమే నినాదంతో ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నారు. ఆయన చేపట్టిన ఈ పర్యటనకు విశేష స్పందన వస్తోం ది. సోమవారం నుంచి మూడో విడత పర్యటనకు స్టాలిన్ సిద్ధమయ్యారు. తొలి రెండు రోజులు సేలంలో, 28, 29 తేదీల్లో విల్లుపురంలో, 31న తిరువణ్ణామలై, నవంబర్ 1న ధర్మపురి, 2న కృష్ణగిరి, 3, 4 తేదీల్లో వేలూరు, 5న కంచిలో, 6,7 తేదీల్లో తిరువళ్లూరుల్లో పర్యటించనున్నారు. అన్నయ్య బాటలో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు తాను సైతం అంటూ మహిళా విభాగం నేతృత్వంలో స్టాలిన్ సోదరి, ఎంపీ కనిమొళి సిద్ధమయ్యారు. డీఎంకేలో చతికిలబడి ఉన్న మహిళా విభాగానికి పునర్జీవం పోసే బాధ్యతను తన గారాలపట్టి కనిమొళికి కరుణానిధి అప్పగించిన విషయం తెలిసిందే. ఆ విభాగం ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన కనిమొళి కార్యక్రమాలను విస్తృత పరుస్తూ వస్తున్నారు. మనకు..మనమే కు వస్తున్న స్పందనను పరిగణనలోకి తీసుకుని తన విభాగం ద్వారా మహిళలను ఆకర్షించేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని సిద్ధం చేసి, జిల్లాలు, మహానగరం, నగర, యూనియన్ల వారీగా కార్యక్రమాలను విస్తృతం చేయబోతున్నారు. కనిమొళి నేతృత్వంలో నియమించిన ఈ కమిటీలు తమ కార్యక్రమాలను విస్తృత పరుస్తూ, ప్రధానంగా మహిళాకర్షణ వైపుగా దూసుకెళ్లబోతున్నాయి. మద్య నిషేధం అమలు నినాదం, రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు, మహిళలపై జరుగుతున్న దాడులను ఎత్తి చూపుతూ ప్రచారం సాగించనున్నాయి. ఇక ఈ కమిటీల్లో చెన్నై జిల్లాలో కనిమొళి, దిండుగల్, కరూర్ జిల్లాల్లో మహిళా నేత నూర్జాహాన్, ఇతర జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో మహిళా విభాగంలో కీలక భూమిక పోషిస్తున్న నేతలు ఉన్నారు. కనిమొళి ప్రయత్నం ఏ మేరకు విజయవంతం అవుతుందో వేచి చూడాల్సిందే. -
భర్త బలత్కారాన్ని రేప్‌గా పరిగణించలేం
-
భర్త బలత్కారాన్ని రేప్‌గా పరిగణించలేం
దీన్ని నేరంగా చేసే ప్రతిపాదనేమీ లేదు: కేంద్రం అంతర్జాతీయ నిర్వచనం వేరు భారత సమాజ స్థితిగతులు వేరు అంతర్జాతీయంగా.. మహిళ సమ్మతి లేకుండా... ఎవరు బలప్రయోగం ద్వారా ఆమెను లొంగదీసుకున్నా, బలాత్కారం చేసినా అది నేరమే. రేప్ కిందకే వస్తుంది. అది పెళ్లాడిన భర్త కావొచ్చు, సహజీవనం చేస్తున్న వ్యక్తి కావొచ్చు, ప్రేమికుడు లేదా ఇంకెవరైనా కావొచ్చు. కనిమొళి ప్రశ్న.. భర్త బలవంతంగా అనుభవించినా (మారిటల్ రేప్) అది రేప్ కాదనే మినహాయింపు ఐపీసీలోని 375 సెక్షన్లో ‘రేప్’ నిర్వచనంలో ఉంది. దీన్ని సవరించేందుకు బిల్లు ఏమైనా తెస్తున్నారా? మహిళలపై వివక్షను అంతమొందించేందుకు ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి... భారత్ ఈ మేరకు చట్ట సవరణ చేయాలని, మారిటల్ రేప్‌ను నేరంగా చేయాలని సూచించింది నిజమేనా? భార్యకు ఇష్టం లేకున్నా, ఆమె సమ్మతి లేకుండా బలవంతపెట్టి శారీరకంగా కలిస్తే అది విదేశాల్లో నేరమే. రేప్ కిందకే వస్తుంది. అయితే అంతర్జాతీయంగా దీనికి నిర్వచనం వేరని, భారత్‌లో నెలకొన్న భిన్నమైన సామాజిక స్థితిగతుల నేపథ్యంలో దీనిని మనదేశంలో రేప్‌గా నిర్వచించలేమని, అలాంటి ఆలోచనేమీ లేదని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో బుధవారం స్పష్టం చేసింది. రాజ్యసభలో డీఎంకే ఎంపీ కనిమొళి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ చౌదరి సమాధానమిస్తూ... భర్తలకు మినహాయింపునిస్తున్న ఐపీసీలోని 375ని సవరించే యోచనేదీ లేదన్నారు. భారత్‌లో 75 శాతం మంది మహిళలు భర్తల చేతిలో బలాత్కారాలకు గురవుతున్నారని ఐరాస పాపులేషన్ ఫండ్ చెప్పిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందా? మంత్రి సమాధానం: మారిటల్ రేప్‌ను భారత్ లాంటి సమాజంలో నేరంగా చేయలేం. ఇక్కడ పెళ్లిని పవిత్రమైనదిగా పరిగణిస్తాం. మన సమాజంలో అక్షరాస్యత శాతం, పేదరికం, విభిన్నమైన సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, విలువలు, మతపరమైన విశ్వాసాలు ఉన్నాయి. ఇలాంటి సమాజంలో భర్త బలవంతాన్ని నేరంగా పరిగణించాలనే డిమాండ్‌ను అమలుచేయడం అంత సులభం కాదు. రేప్ సంబంధిత చట్టాలను సమీక్షించి 172వ నివేదిక సమర్పించినపుడు లా కమిషన్ కూడా భర్త బలాత్కారాన్ని నేరంగా పరిగణించాలని సిఫారసు చేయలేదు. అందువల్ల చట్టాన్ని సవరించే ప్రతిపాదనేమీ లేదు. మహిళలపై వివక్షను రూపుమాపేందుకు ఏర్పాటైన ఐరాస కమిటీ మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాలని భారత్‌కు సిఫారసు చేసింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ, మహిళా శిశు సంక్షేమశాఖ ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి కూడా. దీన్ని మంత్రి స్వయంగా అంగీకరించారు. నిర్భయ ఉదంతం తర్వాత ఏర్పాటైన జస్టిస్ జె.ఎస్.వర్మ కమిటీ మారిటల్ రేప్‌కు ఉన్న మినహాయింపు తొలగిస్తూ ఐపీసీని సవరించాలని సిఫారసు చేసింది. అయితే ప్రభుత్వం దీనిని ఆమోదించలేదు. మారిటల్ రేప్‌ను నేరంగా చేస్తే అమలు చేసేటపుడు ఎన్నో సమస్యలు తలెత్తుతాయని హోంశాఖ అభిప్రాయపడింది. భారత్‌లో కుటుంబ విలువలకు ఇది విఘాతమని పేర్కొంది. పెళ్లి చేసుకోవడం అంటేనే సమ్మతిగా మన సమాజం పరిగణిస్తుందంది. క్రిమినల్ లా (సవరణ) బిల్లు-2012పై ఏర్పాటైన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆనాడు హోంశాఖ అభిప్రాయంతో ఏకీభవించింది. దుమారం రేగుతుంది: అన్ని రంగాల్లో సమాన హక్కుల కోసం ఉద్యమిస్తున్న మహిళా సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. కేంద్ర ప్రభుత్వంపై దేశం లోపలా, అంతర్జాతీయంగా కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తే అవకాశముంది. -
‘కని’కి పదవి
డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి పగ్గాల్ని ఎంపీ, గారాల పట్టి కనిమొళికి అప్పగించారు. యువజన విభాగం పగ్గాలను మళ్లీ స్టాలిన్‌కే కట్టబెట్టారు. ఈ మేరకు డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఆదేశాలతో ప్రధాన కార్యదర్శి అన్భళగన్ వివిధ విభాగాల నిర్వాహకుల్ని శుక్రవారం ప్రకటించారు. సాక్షి, చెన్నై:డీఎంకేలో ప్రక్షళన పర్వం సాగిన విషయం తెలిసిందే. పార్టీ పరంగా జిల్లాల సంఖ్యను 65కు పెంచారు. పార్టీ పదవుల భర్తీ ప్రజాస్వామ్య బద్ధంగా సంస్థాగత ఎన్నికల ద్వారా విజయవంతం చేశారు. రాష్ర్ట పార్టీ అధ్యక్షుడిగా కరుణానిధి, ప్రధాన కార్యదర్శిగా అన్భళగన్, కోశాధికారిగా ఎంకే స్టాలిన్‌ను మళ్లీ ఎన్నుకున్నారు. ఈ సారి పదవుల భర్తీల్లో కనిమొళికి పార్టీ పరంగా అందలం ఎక్కిస్తారన్న ప్రచారం సాగింది. అయితే, పార్టీ పరంగా ఎలాంటి పదవులు ఆమెకు కట్టబెట్టలేదు. ఎట్టకేలకు ఆమెకు చిన్న ప్రమోషన్ ఇచ్చే రీతిలో సాంస్కృతిక విభాగం నుంచి మహిళా విభాగం పోస్టును అప్పగించారు. డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి పగ్గాలను కనిమొళికి అప్పగిస్తూ అన్భళగన్ ప్రకటించారు. యువజన విభా గం ఆవిర్భావ కాలం నాటి నుంచి ప్రధాన కార్యదర్శిగా స్టాలిన్ కొనసాగుతూనే వచ్చారు. ఈ సారి మళ్లీ స్టాలిన్‌కు కోశాధికారి పగ్గాలే దక్కాయి. దీంతో యువజన పగ్గాల్లోను మార్పు జరగలేదు. ఆ పదవిని మళ్లీ స్టాలిన్‌కు కట్టబెడుతూ అధిష్టానం నిర్ణయించింది. కరుణతో అయ్యర్ భేటీ డీఎంకే అధినేత ఎం.కరుణానిధిని కాంగ్రెస్ ఎంపీ మణిశంకరయ్యర్ కలుసుకున్నారు. ఉదయం గోపాలపురంలో ఈ భేటీ సాగడంతో ప్రధాన్యత సంతరించుకుంది. ఉప ఎన్నికల మద్దతు విషయంగా ఏమైనా చర్చ సాగుతున్నదేమోనన్న సంకేతాలతో మీడియా ఉరకలు తీసింది. అయితే, కేవలం మర్యాదేనని అయ్యర్ స్పష్టం చేయడంతో విస్తుపోక తప్పలేదు. ఈ భేటీ గురించి మణి శంకరయ్యర్ మాట్లాడుతూ, కరుణానిధిని కలుసుకుని చాలాకాలం అవుతోందని, ఇప్పుడు చెన్నై వచ్చిన దృష్ట్యా, మర్యాద పూర్వంగా ఆయన్ను కలుసుకున్నానన్నారు. తమ భేటీ పిచ్చా పాటికే పరిమితంగా సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలహీన పడ్డ మాట వాస్తవమేనని, అందరూ కలసి కట్టుగా పునర్ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఓ ప్రశ్నకు అయ్యర్ సమాధానం ఇచ్చారు. జయంతి నటరాజన్ వ్యాఖ్యల గురించి అధిష్టానం స్పందించిందని, తనది అధిష్టానం బాటేనని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. డీఎంకేతో కాంగ్రెస్ మళ్లీ దోస్తీ కట్టేనా..? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, రాజ్య సభలో డీఎంకే ఎంపీ కనిమొళి తాను, మరి కొందరు ఎంపీలందరూ ఒకే జట్టుగా తమిళులనాడు సమస్యలపై గళం విప్పుతున్నామని, తమకు రాజ్య సభలో కూటమి లేదని, అందరిదీ ప్రజా సమస్య పరిష్కారం మాత్రమే మార్గంగా పేర్కొన్నారు. డీఎంకే తో కాంగ్రెస్ కూటమి అన్నది అధిష్టానం చూసుకుంటుందన్నారు. -
ప్రచారానికి కని, ఖుష్బు సిద్ధం
సాక్షి, చెన్నై: డీఎంకే సినీ గ్లామర్లు ప్రచారానికి సిద్ధం అయ్యారు. నటి ఖుష్బు, నటుడు వాగై చంద్రశేఖర్ పర్యటన వివరాలను డీఎంకే ప్రకటించింది. డీఎంకే ఎంపీ, కరుణానిధి గారాలపట్టి కనిమొళి పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేశారు. రాష్ట్రంలో డీపీఏ పేరుతో కూటమిగా డీఎంకే ఎన్నికల్లోకి వెళ్లిన విషయం తెలి సిందే. డీఎంకే 35 స్థానాల్లో, ఆ కూటమిలోని వీసీకే రెండు చోట్ల, ఇండియ యూనియన్ ముస్లిం లీగ్, మనిదనేయ మక్కల్ కట్చి, పుదియ నిధి కట్చిలు తలా ఓ చోట బరిలో దిగాయి. కూటమి అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రచారంలో దూసుకెళుతున్నారు. పార్టీ అధినేత కరుణానిధి ప్రచారానికి సిద్ధమయ్యారు. తమ పార్టీలో ఉన్న నటీ, నటులను ఎన్నికల ప్రచారంలోకి పంపించేందుకు డీఎంకే అధిష్టానం సిద్ధం అయింది. అలాగే, తన గారాల పట్టి కనిమొళి సైతం ప్రచార బాట పట్టే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో వారి పర్యటనల వివరాలను డీఎంకే కార్యాల యం అన్నా అరివాళయం సోమవారం ప్రకటించింది. ప్రచారం నిమిత్తం ప్రత్యేక వాహనాలు సిద్ధం అయ్యాయి. ప్రచార బాట: ఏప్రిల్ ఐదు నుంచి కనిమొళి తన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు. ఆ రోజు ఉత్తర చెన్నైలో ఆమె ప్రచారానికి శ్రీకారం చుడతారు. విరామం లేకుండా ఆమె పర్యటన 22వ తేదీ వరకు సాగనున్నది. ఏడో తేదీన కంచి, కడలూరు, చిదంబరం, 9న శ్రీ పెరంబతూరు, పదిన అర్కోణం, 11న తిరువళ్లూరు,12నవేలూరు, 13నఆరణి, 14న సేలం, 15న నామక్కల్, 16న ఈరోడ్, 17న దిండుగల్, 18న విరుదునగర్, 19న తెన్కాశి, 20న తూత్తుకుడి, 21న తిరునల్వేలి, 22న కన్యాకుమారిలో ఆమె పర్యటించనున్నారు. నటి ఖుష్బు ఏప్రిల్ ఐదో తేదీన తిరుచ్చి నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ఆరున కరూర్, 7న ఈరోడ్, 8న నీలగిరి,9న పొల్లాచ్చి, 10న కోయం బత్తూరు,11న తిరుప్పూర్, 12న సేలం, 13న ధర్మపురం, 14న కృష్ణగిరి, 15న వేలూరు, 17న ఆరణి, 18న తిరువణ్ణామలై,19న కాంచీపురం,20 అరక్కోణం, 21న శ్రీపెరంబదూరు , 22న తిరువళ్లూరుల్లో ఖుష్బు ప్రచారం సాగునున్నది. వాగై : ఏప్రిల్ ఒకటి నుంచి వాగై చంద్ర శేఖర్ ప్రచారం సాగనున్నది. తిరుచ్చిలో తన పర్యటనకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. రెండు దిండుగల్, మూడున శివగంగై, 4న రామనాథపురం, 5న మదురై, 6న తేని, 7న దిండుగల్, 8న కరూర్, 9న తంజావూరు, 10న మైలాడుతురై, 11న చిదంబరం, 12న పుదుచ్చేరి, 13న కడలూరు, 14న దక్షిణ చెన్నై, 15న సెంట్రల్ చెన్నై, 16న కాంచీపురం, 17న వేలూరు, 18న తిరువళ్లూరు, 19న తిరువణ్ణామలై , 20న ఆరణి, 21న విల్లుపురం, 22న శ్రీ పెరంబదూరుల్లో పర్యటించనున్నారు. -
మేమూ రెఢీ!
డీపీఏ కూటమికి మద్దతుగా ప్రచారం చేసేందుకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి కనిమొళి, మహిళానేత, సినీ నటి ఖుష్బూ రెడీ అయ్యారు. ఏప్రిల్ మొదటి వారంలో ఖుష్బూ, ఐదో తేదీ నుంచి కనిమొళి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఓపెన్ టాప్ వాహనాలు వీరి కోసం సిద్ధం అవుతున్నారుు. సీఎం జయలిలత వాగ్దాటిని ఢీ కొట్టేందుకు ఈ ఇద్దరు మహిళలు సిద్ధమయ్యారు. సాక్షి, చెన్నై: వీసీకే, ఎంఎంకే, ఐయూఎంఎల్, పీటీలతో కలసి డీఎంకే నేతృత్వంలో డెమాక్రటిక్ ప్రోగ్రెసివ్ అలయన్(డీపీఏ) ఆవిర్భవించిన విషయం తెలిసిందే. పదుచ్చేరితో పాటుగా రాష్ర్టంలోని 40 స్థానాల బరిలో ఈ కూటమి అభ్యర్థులు ఉన్నారు. వీరికి మద్దతుగా ప్రచార బాటలో డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ నిమగ్నమయ్యారు. తాను సైతం అంటూ పార్టీ అధినేత ఎం కరుణానిధి ప్రచారానికి సిద్ధం అయ్యారు. అన్నాడీఎంకే అధినేత్రి సీఎం జయలలిత ఒంటి చేత్తో తమ అభ్యర్థులను గెలిపించుకోవడం లక్ష్యంగా ఉరకలు తీస్తుంటే, ఆమె వాగ్దాటిని ఎదుర్కొనే విధంగా మహిళా నాయకుల్ని ప్రచార కదన రంగంలోకి దించేందుకు డీఎంకే సిద్ధం అయింది. కని, ఖుష్బూ రెడీ జయలలిత తమ మీద విమర్శల వర్షం కురిపిస్తుండటంతో దాన్ని తమ వాగ్దాటితో తిప్పికొట్టే విధంగా ప్రచారంలోకి ఎంపీ కనిమొళి, నటి ఖుష్బూలు రంగంలోకి దిగనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా సినీ గ్లామర్ ఖుష్బూను రంగంలోకి దించిన విషయం తెలిసిందే. వాక్ చాతుర్యంతో, చక్కటి ప్రసంగంతో ఓటర్లను ఆమె ఆకర్షించారు. తాజాగా జరగనున్న ఎన్నికల్లో ఆమె సేవల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకునేందుకు డీఎంకే నిర్ణయించింది. ఇది వరకు వేదికలపై నుంచి ప్రసంగాలు ఇచ్చిన కనిమొళి, ఈ పర్యాయం రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ టాప్ వాహనంలో పర్యటించేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రధానంగా జయలలిత ప్రసంగాల్ని టార్గెట్ చేసి, ఆమె వ్యాఖల్ని దీటుగా ఎదుర్కొనే రీతిలో ఈ ఇద్దరు మహిళు తర్ఫీదు పొందుతున్నారని సమాచారం. కనిమొళికి చక్కటి ప్రసంగాన్ని ఇవ్వగల సత్తా ఉంది. ఖుష్బూ అనర్గళంగా ప్రసంగించగలరు. అయితే, కొన్ని అంశాల్ని ఎత్తి చూపాల్సిన సమయంలో స్క్రిప్ట్ తప్పని సరి. పర్యటన వివరాలు కనిమొళి పర్యటన వివరాలు సిద్ధం చేసే పనిలో అన్నా అరివాళయం వర్గాలు ఉన్నాయి. ఆమె ఏప్రిల్ 5 తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. స్టాలిన్ కన్యాకుమారి నుంచి రాష్ర్ట వ్యాప్తంగా పర్యటిస్తూ వస్తున్న దృష్ట్యా, చెన్నై నుంచి ఆమె ప్రచారం ఆరంభించే రీతిలో పర్యటన వివరాల్ని సిద్ధం చేస్తున్నారు. లేని పక్షంలో కనిమొళి మద్దతుదారులు అత్యధికంగా ఉండే కడలూరు, చిదంబరం నియోజకవర్గాల నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టే అవకాశాలు ఉన్నాయని అరివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, ఖుష్బూ పర్యటన వివరాలు సైతం సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి పార్టీకి సేవలను అందించేందుకు ఖుష్బూ సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈమె పర్యటన సాగనుంది. వీరు రోడ్ షోలలో కూడా పాల్గొని ప్రచారం చేయనున్నారు. ప్రధాన కూడళ్లల్లో ప్రసంగాలు, అభ్యర్థులను ఓటర్లకు పరిచయం చేసే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీరి ప్రచారం కోసం అన్ని వసతులతో కూడిన రెండు ఓపెన్ టాప్ వాహనాలు సిద్ధం అవుతున్నాయి. జయను ఎదుర్కోవడానికే.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సుడిగాలి ప్రచారానికి అనూహ్యస్పందన రావడంతోనే ఈ ఇద్దరినీ రంగంలోకి దించేందుకు కరుణానిధి నిర్ణయించినట్టు అరివాళయం వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో పంచముఖ సమరం నెలకొనడంతో ఓట్లు చీలడం ఖాయం. ఈ దృష్ట్యా, తమ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా ప్రచారం బరిలోకి అందరినీ దించే పనిలో కరుణానిధి ఉన్నారు. -
కనిమొళి, రాజాలపై త్వరలో ఈడీ చార్జిషీట్
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై డీఎంకే ఎంపీలు కనిమొళి, ఏ.రాజాలపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) త్వరలో చార్జిషీట్ దాఖలు చేసే అవకాశముంది. అటార్నీ జనరల్ కార్యాలయం ఈడీ పంపిన చార్జిషీట్‌ను తదుపరి చర్యల నిమిత్తం న్యాయ శాఖకు పంపినట్టు తెలుస్తోంది.