క్షేమంగా బయటపడిన ఖుష్బు | Bus hits Khushboo's car! | Sakshi
Sakshi News home page

క్షేమంగా బయటపడిన ఖుష్బు

Published Wed, Jan 29 2014 3:03 AM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

క్షేమంగా బయటపడిన ఖుష్బు - Sakshi

క్షేమంగా బయటపడిన ఖుష్బు

నటి ఖుష్బు కారు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు తప్పించుకున్నారు. సోమవారం చెన్నైలోని తన ఇంటి నుంచి ఒక కార్యక్రమంలో

నటి ఖుష్బు కారు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు తప్పించుకున్నారు. సోమవారం చెన్నైలోని తన ఇంటి నుంచి ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరారు. రోడ్డుమీద ప్రయాణిస్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారును నిలిపారు. దీంతో వెనుక వస్తున్న నగర రవాణ విభాగం బస్సు ఖుష్బు కారును బలంగా ఢీ కొంది. కారు వెనుకభాగం చాలా వరకు ధ్వంసమైంది. అయితే అదృష్టవశాత్తు కారులో వున్న ఖుష్బు ఎలాంటి ప్రమాదం జరగలేదు. 
 
 ఈ సంఘటనపై ఖుష్బు తన ట్విట్టర్‌లో ఇలా పేర్కొన్నారు. కారు ప్రమాదంలో తన కెలాంటి ప్రమాదం జరగలేదు, అయితే ముందు వెళ్లే వాహనాలను చూడకుండా నిర్లక్ష్యంగా బస్సును నడిపిన డ్రైవర్‌పై చాలా ఆగ్రహం వచ్చింది. ఆ డ్రైవర్ బాధ్యతా రాహిత్యం వలన నా కారు ధ్వంసం అవడంతో పాటు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. అతనిపై ఫిర్యాదు చేస్తే వాళ్ల సంఘం కాపాడే ప్రయత్నం చేయవచ్చు. ఆ డ్రైవర్ కూడా తన కుటుంబం నడిరోడ్డున పడుతుందని నన్ను బతిమాలాడవచ్చు. ఇవన్నీ ఆలోచించి ఫిర్యాదు చేయలేదు. అయితే ఈ ఖరీదైన కారును నా భర్త నాకు బహుమతిగా ఇచ్చారు. అలాంటి కారు ధ్వంసం కావడం బాధగా ఉంది అంటూ ఖుష్బూ ట్వీట్ చేశారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement