‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. జగపతిబాబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రానికి టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఈ చిత్రంలో ఖుష్బూ కీలక పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌లో ఆమె పాల్గొంటున్నారు. హీరోహీరోయిన్లు గోపీచంద్, డింపుల్ హయతి, ఖుష్బూ తదితర ప్రధాన తారగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.
ఈ సంగతి ఇలా ఉంచితే... నాలుగేళ్ల క్రితం వరకూ ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చేస్తూ వచ్చారు ఖుష్బూ. అది కూడా ఎక్కువగా గెస్ట్ రోల్స్ మాత్రమే చేశారు. అయితే ఇప్పుడు కెరీర్‌ని సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు. ఇటీవల ‘అన్నాత్తే’లో నటించారు. తాజాగా విడుదలైన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రంలో ఓ కీలక పాత్ర చేశారామె. ఇప్పుడు గోపీచంద్ సినిమా. దీన్ని బట్టి చూస్తే ఖుష్బూ ఇక నాన్‌స్టాప్‌గా సినిమాలు చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే ఇటీవల బరువు కూడా తగ్గినట్లున్నారు.
Comments
Please login to add a commentAdd a comment