అన్నయ్యకు అక్కగా...మరి... తమ్ముడికి? | Khushboo in powerstar movie?? | Sakshi
Sakshi News home page

అన్నయ్యకు అక్కగా...మరి... తమ్ముడికి?

Nov 3 2016 10:53 PM | Updated on Mar 22 2019 5:29 PM

అన్నయ్యకు అక్కగా...మరి... తమ్ముడికి? - Sakshi

అన్నయ్యకు అక్కగా...మరి... తమ్ముడికి?

తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబినేషన్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. పవన్‌కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్‌ది కూడా అలాంటి కాంబినేషనే.

తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబినేషన్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. పవన్‌కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్‌ది కూడా అలాంటి కాంబినేషనే. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు ఒకదాన్ని మించి ఒక్కటి విజయవంతమయ్యాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో సీనియర్ నటి ఖుష్బూ ఓ ముఖ్యమైన పాత్రలో నటించనున్నారని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘అత్తారింటికి దారేది’లో పవన్ అత్తగా నదియాకు ఎంతటి ప్రాధాన్యం ఉన్న పాత్రను త్రివిక్రమ్ సృష్టించారో తెలిసిందే. తాజా చిత్రంలో ఖుష్బూ ఏ పాత్రలో కనిపిస్తారనే చర్చ అప్పుడే మొదలైంది. పదేళ్ల క్రితం ‘స్టాలిన్’ చిత్రంలో చిరంజీవికి అక్కగా నటించారు ఖుష్బూ. ఇప్పుడు తమ్ముడికి కూడా అక్కగా నటిస్తారా? లేక అత్తగా నటిస్తారా? వేరే ఏదైనా పాత్రలో కనిపిస్తారా? అనేది చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement