
రజనీకాంత్ తో నటించను
అవకాశం వచ్చినా రజనీకాంత్‌తో నటించనంటున్నారు నటి కుష్బూ. అటు సినిమాల్లోను, ఇటు రాజకీయాల్లోను నాయకురాలిగా సంచలనం సృష్టించిన నటి కుష్బు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నా సినిమాకు మాత్రం చేరువగానే ఉన్నారు. పలు బుల్లితెర కార్యక్రమాలతోపాటు వెండితెర నిర్మాతగా కొనసాగుతూ అడపాదడపా నటిగా మెరుస్తున్న కుష్బూ ఇటీవల ట్విట్టర్‌లో తన అభిమానుల ప్రశ్నలకు కింది విధంగా బదులిచ్చారు.
రాజకీయ పునఃప్రవేశం ఉంటుందా?
మళ్లీ రాజకీయ రంగప్రవేశ ఆలోచన ప్రస్తుతానికి లేదు.
ఇంతకు ముందు రజనీకాంత్ సరసన అన్నామలై లాంటి హిట్ చిత్రాఓ్ల నటించారు. మళ్లీ అవకాశం వస్తే ఆయనతో నటిస్తారా?
అలాంటి అవకాశం వచ్చినా రజనీకాంత్‌తో నటించను.
కమల్ హాసన్‌తో కలిసి నటిస్తారా?
కమల్‌తో నటించే అవకాశం వస్తే వదులుకోను.
సీనియర్ నటుడు కార్తీక్ నటించిన చిత్రాలు మీకు నచ్చాయూ?
కార్తీక్ నటించిన అగ్ని నక్షత్రం, మౌనరాగం చిత్రాలు బాగా నచ్చాయి.
మీ రియల్ హీరో ఎవరు?
ఇంకెవరు? నా భర్త సుందర్ సి నే
దర్శకత్వం ఆలోచన ఉందా?
ఈ విషయంలో నాకింకా స్పష్టత లేదు.
సుందర్ సి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించిన మదగజరాజా చిత్రం ఎప్పుడు విడుదలవుతుంది?
ఆ చిత్రం విడుదల సాధ్యమయ్యేలా కనిపించడంలేదు.
మీరెప్పుడు చీరలోనే కనిపిస్తున్నారు?
చీరలంటేనే నాకిష్టం అది ధరించడం కూడా సౌకర్యంగా ఉంటుంది.