Complaint Filed Against Actor-Turned-Politician Khushboo Sundar - Sakshi
Sakshi News home page

‘చెప్పులతో కొట్టాలి’.. నటి, బీజేపీ నేత కుష్బూపై పోలీసులకు ఫిర్యాదు

Published Fri, Jun 23 2023 9:07 AM | Last Updated on Fri, Jun 23 2023 9:56 AM

Complaint Police Against Actor Politician Khushboo - Sakshi

సాక్షి, చైన్నె: సినీ నటి, బీజేపీ నేత, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు కుష్బూ సుందర్‌పై తిరునల్వేలి పోలీసు కమిషనర్‌కు పాళయం కోట్టైకు చెందిన న్యాయవాది రాజు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు స్పందించారు. కేసు నమోదు విషయంగా అధికారులతో కమిషనర్‌ రాజేంద్రన్‌ గురువారం సమావేశమయ్యారు. గత నెల ట్విట్టర్‌ వేదికగా జయశంకర్‌, జయ నాథ్‌ అనే వ్యక్తులకు సమాధానం ఇచ్చే క్రమంలో కుష్బూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని, గృహిణులు, మహిళలను ఉద్దేశించి ఆమె అనుచితంగా స్పందించారని ఆరోపించారు.

చెప్పులతో కొట్టాలి వంటి వ్యాఖ్యలు చేయడమే కాకుండా తీవ్ర విమర్శలు చేశారని, దీనిని చూసిన తన ఇంట్లోని మహిళలే అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను ట్వీట్‌ వేదికగా ఆమె చేయడాన్ని ఖండిస్తున్నామని, దీనిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అనే విషయంగా కమిషనర్‌ రాజేంద్రన్‌ అదనపు కమిషనర్‌ శరవణకుమార్‌, సతీష్‌కుమార్‌, అనిత నగర పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలో అని పరిశీలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement