మోడల్‌, టీవీ యాంకర్‌ ఆత్మహత్య | Ahmedabad model commits suicide | Sakshi
Sakshi News home page

మోడల్‌, టీవీ యాంకర్‌ ఆత్మహత్య

Published Tue, Mar 21 2017 4:57 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

మోడల్‌, టీవీ యాంకర్‌ ఆత్మహత్య - Sakshi

మోడల్‌, టీవీ యాంకర్‌ ఆత్మహత్య

అహ్మదాబాద్: అహ్మదాబాద్‌కు చెందిన  ప్రముఖ మోడల్ ఖుష్బూ భట్ (27) ఆత్మహత్య కలకలం రేపింది.  గతంలో టీవీ యాంకర్‌గా పనిచేసిన ఖుష్బూ జోధ్‌పూర్ లోని సుకేతు టవర్‌ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.  ఈ ఘటన ఆదివారం చోటుచేసుకొంది. దీంతో ఆమె కుటుంబం  తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వర్దమాన మోడల్‌ గా వెలుగొందుతున్న ఖుష్బూ ఆకస్మిక మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

తండ్రి మనీష్‌ (59) అమ్మమ్మ(92)తో  కలిసి వుంటున్న ఆమె  ఆదివారం  తండ్రితో కలిసి జోథ్పూర్ లోని సుకేతు టవర్ లో నివసిస్తోంది.  మధ్యాహ్నభోజనం చేసిన అనంతరం ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు చెప్పారు. ప్రమాదవశాత్తు మృతి చెందినట్టుగా  కేసు నమోదు చేసిన  పోలీసులు విచారణ చేస్తున్నారు  అయితే కుష్బూ ఎందుకు ఆత్మహత్యకు గలకారణాలను ఆరా తీస్తున్నామని,    సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోటు  లభించలేదని పోలీసులు చెప్పారు.

అయితే భోజనం చేసే సమయంలో తాను డయాబెటిక్ రోగినని తనకు ఎక్కువ భోజనం పెట్టకూడదని కుష్బూను కోరారని ఆమె తండ్రి చెప్పారు. దీంతో ఆమె డిప్రెషన్ కు గురైందని, వెంటనే రూమ్ లోకి వెళ్ళి తాళం వేసుకొందని తెలిపారు.  సోమవారం మధ్యాహ్యం ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి పొరుగువారి సహయంతో రూమ్ తాళం పగులగొట్టించి చూడగా.. ఆమె ఫ్యాన్‌కు  ఉరి వేసుకుని చనిపోయినట్టు గమనించామన్నారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న ఆమె సోదరుడు వచ్చిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అటు ఈమె మరణంపై  ఇరుగుపొరుగు వారు పలు అలుమానాలను వ్యక్తం చేస్తున‍్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement