Kailia Posey Passes Away at 16: Reality Star Grinning Girl Kailia Posey Commits by Suicide - Sakshi
Sakshi News home page

Kailia Posey: అంతా హ్యాపీ అనుకుంటున్న టైంలో.. నటి ఆత్మహత్య

Published Thu, May 5 2022 8:17 AM | Last Updated on Thu, May 5 2022 8:42 AM

Reality Star Grinning Girl Kailia Posey Commits By Suicide - Sakshi

చిన్నవయసులోనే ఇంటర్నెట్‌లో దక్కిన గుర్తింపు, కాస్త పెరిగాక దక్కిన పేరుప్రఖ్యాతులు. అంతా సంతోషంగా సాగిపోతుందనుకున్న టైంలో ఊహించని విషాదం. కేవలం 16 ఏళ్ల వయసుకే అర్ధాంతరంగా జీవితాన్ని ముగిచుకుంది కాయిలియ పోసే. ఆమె కథ ఇప్పుడు ఇంటర్నెట్‌లో విషాదాన్ని నింపింది. 

కాయిలియ పోసే.. అమెరికన్‌ రియాలిటీ టీవీ స్టార్‌. చిన్నవయసులోనే  ‘టాడ్‌లర్స్‌ అండ్‌ టియారస్‌’ సిరీస్‌తో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇంటర్నెట్‌ గ్రిన్నింగ్‌ గర్ల్‌గా ఆమె జిఫ్‌ ఫైల్‌ ఈనాటికీ విపరీతంగా వైరల్‌ అవుతుంటుంది. అయితే.. హఠాత్తుగా ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. 

కెనడా సరిహద్దుకు కొద్ది మైళ్ల దూరంలో.. వాషింగ్టన్‌ స్టేట్‌ బిర్చ్‌ బే స్టేట్‌ పార్క్‌ వద్ద ఆమె మృతదేహాన్ని గుర్తించారు. భవిష్యత్తులో ఎంతో ఎదిగే అవకాశం ఉన్నా.. ఆమె తీసుకున్న తీవ్ర నిర్ణయం.. మా కుటుంబంలో విషాదాన్ని నింపింది అంటూ పోసే కుటుంబం ఒక ప్రకటనలో తెలపింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

హైలీ టాలెంటెడ్‌ అయిన కాయిలియ పోసే.. చిన్నతనం నుంచే ఎన్నో అవార్డులు, రివార్డులు, పోటీల్లో గెలుపొందింది. స్టార్‌ టాడ్‌లర్స్‌ షో టీఎల్‌సీ ఛానెల్‌లో 2009 నుంచి 2013 మధ్య టెలికాస్ట్‌ కాగా, అందులో అందాల పోటీలకు తమ పిల్లలను ప్రిపేర్‌ చేసే కుటుంబాలను చూపిస్తూ వచ్చారు. అందులో ఒక తారే ఈ కయిలియా పోసే. ఆపై ఆమె ఎన్నో టీవీ సిరీస్‌లు, రియాలిటీ షోలలోనూ కనిపించింది.

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి..
రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement