అమెరికా వ్యాపారవేత్త జేమ్స్ మైఖేల్ క్లైన్ ఎత్తైన భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 2000లో ఫాండాంగో మూవీ టికెటింగ్ వ్యాపారాన్ని ప్రారంభించిన ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ 64 ఏళ్ల జేమ్స్ మైఖేల్ క్లైన్ మంగళవారం ఉదయం మాన్‌హాటన్‌లోని కింబర్లీ హోటల్ 20వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక వార్తా నివేదిక పేర్కొంది.
న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రకటన ప్రకారం.. పోలీసు అధికారులు ఉదయం 10:19 గంటలకు హోటల్‌కు చేరుకుని ఎత్తు నుంచి పడిపోయిన వ్యక్తిని గుర్తించి దర్యాప్తు చేపట్టారు. ఆయన గదిలో సూసైడ్ నోట్ లభించినట్లు తెలుస్తోంది. మైఖేల్ క్లైన్‌కు భార్య పమేలా బి క్లైన్, ఆరుగురు పిల్లలు ఉన్నారు.
ప్రస్తుతం ఎన్‌బీసీ యూనివర్సల్, వార్నర్ బ్రదర్స్ యాజమాన్యంలో ఉన్న ఫాండాంగోను 2011లో వీడిన తర్వాత, క్లైన్ తన అక్రెటివ్ కంపెనీ ద్వారా అక్యుమెన్, ఇన్సూరియన్, అకోలేడ్ లను స్థాపించారు. హెడ్జ్ ఫండ్ బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్‌తో సహా అనేక టెక్ కంపెనీలు, వెంచర్ క్యాపిటల్ వ్యాపారాలను కూడా క్లైన్ నిర్వహించారు. జక్స్‌టాపోస్‌కి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. జంతు సంరక్షణ న్యాయవాది అయిన ఆయన నేషనల్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ చైర్మన్‌గా కూడా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment