విద్యా ఓకే... వెయిటింగ్‌లో ఖుష్బూ! | Old Yet Charming Actress for Rajinikanth? | Sakshi
Sakshi News home page

విద్యా ఓకే... వెయిటింగ్‌లో ఖుష్బూ!

Published Sun, Mar 19 2017 11:05 PM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM

విద్యా ఓకే... వెయిటింగ్‌లో ఖుష్బూ!

విద్యా ఓకే... వెయిటింగ్‌లో ఖుష్బూ!

దీపికా పదుకొనె కాదు... విద్యా బాలన్‌తో సూపర్‌స్టార్‌ జోడీ కడుతున్నారట! మరో హీరోయిన్‌గా ఖుష్బూ పేరు వినిపిస్తోంది. ‘కబాలి’ తర్వాత రజనీకాంత్‌ హీరోగా మరో సినిమా తీయడానికి దర్శకుడు పా. రంజిత్‌ సిద్ధమైన సంగతి తెలిసిందే. ముంబయ్‌ నేపథ్యంలో మాఫియా కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో సూపర్‌ స్టార్‌కు జోడీగా దీపికా పదుకొనె నటిస్తారంటూ వచ్చిన వార్తలను దర్శకుడు ఖండించారు. మరి, రజనీకి జోడీగా ఎవరు నటిస్తారంటే? ‘‘ఓ హీరోయిన్‌గా విద్యా బాలన్‌ను ఎంపిక చేశారు. మరో హీరోయిన్‌గా ఖుష్బు నటించే ఛాన్సుంది. 90లలో స్టార్లుగా ఓ వెలుగు వెలిగిన మరో ఇద్దరు హీరోయిన్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి’’ అని చెన్నై కోడంబాక్కమ్‌ అంటోంది.

రాజకీయాలతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఖుష్బు రీసెంట్‌గా రీ–ఎంట్రీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. తమిళంలో రాధిక, సుహాసిని, ఊర్వశి, ఆమె ముఖ్య తారలుగా ఓ సినిమా రూపొందుతోంది. తెలుగులో పవన్‌కల్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో కీలక పాత్ర చేయడానికి అంగీకరించారు. రజనీ–రంజిత్‌ సినిమా ఓకే అయితే సూపర్‌ ఛాన్స్‌ వచ్చినట్లే! ‘కబాలి’లోనూ రజనీకి జోడీగా యంగ్‌ లుక్స్‌తో కనిపించే హీరోయిన్లను కాకుండా కాస్త ఎక్కువ వయసున్న హీరోయిన్‌లా కనిపించే రాధికా ఆప్టేను దర్శకుడు పా. రంజిత్‌ ఎంపిక చేశారు. అందులో ఆమె పాత్ర కూడా అటువంటిదే. మరి, ఇప్పుడీ సినిమాలో విద్యా బాలన్, ఖుష్బు పాత్రలు ఎలా ఉంటాయో!? రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ మేలో ప్రారంభించాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement