సినిమా ఆగిపోలేదు.. స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతోంది..! | Director Sundar c clarity on Sangamithra | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 16 2018 12:26 PM | Last Updated on Thu, May 9 2024 1:40 PM

Director Sundar c clarity on Sangamithra

బాహుబలి ఘనవిజయం సాధించిన తరువాత అదే స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు తల పెట్టిన కోలీవుడ్ సినిమా సంఘమిత్ర. తమిళ దర్శకుడు సి సుందర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌కు ముందుగా శృతిహాసన్‌ ను తీసుకున్నారు. శృతి కూడా లండన్‌ వెళ్లి మరీ యుద్ధవిద‍్యల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. కానీ సినిమా అధికారికంగా ప్రారంభించిన తరువాత స్క్రిప్ట్‌ ఇంకా రెడీ కాలేదన్న కారణంతో ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంది.

అయితే శృతిహాసన్‌ హ్యాండ్‌ ఇచ్చిన దగ్గర నుంచి సంఘమిత్ర ఆగిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై దర్శకుడు సుందర్‌ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. 18 నెలలుగా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలిపిన డైరెక్టర్‌, కొంత గ్రాఫిక్స్ వర్క్‌ కూడా పూర్తయిన తరువాత షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వెళ్లడించారు. జయం రవి, ఆర్యలు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో దిశాపటానిని హీరోయిన్‌ గా ఫైనల్‌ చేసే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement