Sangamithra
-
‘సంఘమిత్రలు ఉంటే గ్రామాల్లో ఆరోగ్యం’
సాక్షి, తిరుపతి: ఎన్నికలకు మూడు నెలల ముందు ఇచ్చిన హామిని.. ఎన్నికల తరువాత మూడు నెలల్లో అమలు చేయడం సామాన్యమైన విషయం కాదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం తిరుపతి రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో భాస్కర్‌రెడ్డిని సంఘమిత్రలు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబపై ప్రజలకు నమ్మకం ఉందని తెలిపారు. సంఘమిత్రలు ఉంటే గ్రామాలు ఆరోగ్యంగా ఉంటాయనే నమ్మకాన్ని కలిగించాలన్నారు. ప్రతి గ్రామంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలపరచి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సంఘమిత్రలను అదేశించారు. అమ్మబడి, రైతుభరోసా, ఫించన్లు, ఉగాదినాటికి గృహాలు, ఆరోగ్య శ్రీ, ఆటో కార్మికులు ఇలా ఒకే వర్గమని లేకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలను అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో కొన్నిచోట్ల అవినీతి జరిగిందని.. అలాంటి వాటిని సరిద్దిదుకునే సమయం వచ్చిందన్నారు. సంఘమిత్రలు భవిష్యత్తులో ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినా ఆర్చర్యం లేదన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థలాగా సంఘమిత్ర వ్యవస్థను సీఎం జగన్ గుర్తించాలని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. తమ కష్టాన్ని గుర్తించి ఇచ్చిన హామిని నేరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి, తమ వెన్నంటి ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంఘమిత్రలు కృతజ్ఞతలు తెలిపారు. -
త్వరలో సెట్స్ మీదకు 300 కోట్ల చిత్రం
బాహుబలి రిలీజ్ తరువాత తమిళ సీనియర్ దర్శకుడు సుందర్.సి అదే స్థాయిలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అయ్యారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో సంఘమిత్ర సినిమాను అట్టహాసంగా ప్రారంభించారు. జయం రవి, ఆర్యలు ప్రధాన పాత్రల్లో శృతిహాసన్ టైటిల్ రోల్లో సంఘమిత్ర సినిమాను ఎనౌన్స్ చేశారు. అయితే సినిమాను లాంఛనంగా ప్రారంభించిన కొద్ది రోజులకే శృతిహాసన్ ఈ ప్రాజెక్ట్ నుంది తప్పుకుంది. తరువాత మరో హీరోయిన్ను ప్రకటించకపోవటంతో ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారన్న టాక్ వినిపించింది. అయితే సుందర్ ఈ సినిమా త్వరలోనే ప్రారంభించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. శృతిహాసన్ స్థానంలో బాలీవుడ్ నటి దిశాపటాని నటించనున్నారట. ఈ ఏడాది జూలైలో ఈ సినిమాను షూటింగ్‌ను ప్రారభించేందుకు ప్లాన్ చేస్తున్నారట. శ్రీ తేండాల్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిచనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్కు సంబంధించి చిత్రయూనిట్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారన్న టాక్ వినిపిస్తోంది. -
శ్రుతి ఆంతర్యం ఏమిటి?
సాక్షి, చెన్నై: శ్రుతి ఆంతర్యం ఏమిటి? ఆమె అభిమానులతో పాటు సినీ వర్గాల్లో చెలరేగుతున్న ప్రధాన ప్రశ్న ఇదే. సంగీతం ఈమె ప్రధాన నేస్తం. పలు సంగీత ఆల్బమ్‌లు చేసిన శ్రుతిహాసన్ తొలుత సంగీతదర్శకురాలిగా సినీరంగ ప్రవేశం చేశారు. ఎన్నైపోల్ఒరువన్ చిత్రం సంగీతదర్శకురాలిగా శ్రుతికి మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఆ తరువాత లక్కీ అనే హిందీ చిత్రంలో నటిగా అవకాశం రావడంతో నటించి చూద్దాం అన్న ధోరణిలో ఆ చిత్రం చేశారు. ఆ చిత్రం విజయం సాధించకపోయినా తెలుగు, తమిళం భాషల్లో వరుసగా అవకాశాలు రావడంతో నటిగా కొనసాగుతున్నారు. అలా కొన్ని సక్సెస్‌లతో క్రేజీ హీరోయిన్గా పేరుతెచ్చుకున్న శ్రుతికి అనూహ్యంగా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఇందుకు కారణం ఆమె స్వయంకృతాపరాధమే అనే ప్రచారం జరుగుతోంది. మంచి మార్కెట్ ఉండగా సంఘమిత్ర చిత్రం నుంచి వైదొలగి వివాదాల్లో చిక్కుకున్న శుత్రికి ఆ తరువాత ఒక్క నూతన చిత్రం అంగీకరించకపోవడం చర్చకు దారి తీసింది. తన తండ్రితో కలిసి నటిస్తున్న శభాష్‌నాయుడు సగంలోనే నిలిచిపోవడం ఆమె కెరీర్‌కు మైనస్‌గా మారిం దనే చెప్పాలి. ప్రస్తుతం చేతిలో ఒక్క చిత్రం లేదు. ఇటీవల శ్రుతి తన మేను అందంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ప్రచారం వైరల్ అవుతోం ది. ఆ మధ్య తన గ్లామర్‌పై విమర్శలు రావడంతో తన మేనుకు మెరుగులు దిద్దుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఒక ప్రముఖ వైద్యుడి పర్యవేక్షణలో శ్రుతి కూడా తన మేను అందాలను మెరుగు పరుచుకుంటున్నట్లు ప్రచారం. ఇదటుంచితే శ్రుతి ఈ మధ్య తన బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. తండ్రి కమలహాసన్‌కు, తల్లి సారికకు పరిచయం చేసి వారి ఆమోదముద్రను పొందిన శ్రుతి త్వరలో బాయ్‌ఫ్రెండ్ మైఖెల్ కోర్సెల్ను వివాహం చేసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం మీడియాలో వైరల్ అవుతోంది. వివాహనంతరం నటనకు గుడ్‌బై చెప్పి అంతర్జాతీయ సంగీత ఆల్బమ్‌ల రూపకల్పన చేయాలనే ఆలోచనతో శ్రుతిహాసన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంపై శ్రుతి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. -
మహాబలి
బాహుబలి చూస్తిరా? అంతకంటే పెరియ (పెద్ద) సినిమా చూస్తరా? బాహుబలి కంటే మహాబలి లాంటి సినిమాలు ఇండియాలో హాల్చల్ చేయబోతున్నాయి. బోట్లలో నింపినా సరిపోవు. అన్ని దుడ్లు... మునుగుతాయా? తేలతాయా? చూస్తమా? వెయ్యి కోట్ల భీముడు భీముడు బలవంతుడా లేక బాహుబలినా! అయినా ఆ పోలికేంటి? భీముడు రియల్ క్యారెక్టర్. బాహుబలి రీల్ క్యారెక్టర్ కదా అనుకుంటున్నారా? కరెక్టే. అయితే ఈ ఇద్దరి బలానికి పోలిక పెట్టింది రీల్ వైజ్‌గానే. బడ్జెట్ వైజ్‌గా ఎవరు పెద్ద అంటే. నిన్న మొన్నటి వరకూ ‘బాహుబలి’ పెద్ద. ఇప్పుడు భీముడే బిగ్. ‘బాహుబలి’ రెండు పార్ట్స్ బడ్జెట్ దాదాపు 300 కోట్లు. మరి భీముడికి అయ్యే బడ్జెట్ ఎంతో తెలుసా? 1000 కోట్లండి బాబు. వీఏ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో జ్ఞానపీuŠ‡ అవార్డుగ్రహీత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ రాసిన బుక్ ఆధారంగా ‘మహాభారతం’పై ఈ సినిమా తీయడానికి బీఆర్ శెట్టి అనే బిలియనీయర్ రెడీ అయ్యారు. భీముడి క్యారెక్టర్ చుట్టూ తిరిగే ఈ సినిమాకయ్యే బడ్జెట్ 1000 కోట్లు. టైటిల్ రోల్‌ని మోహన్‌లాల్ చేయబోతున్నారు. కర్ణుడి పాత్రలో నాగార్జున కనిపిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ విషయం తెలియడానికి ఇంకా టైమ్ పడుతుంది. మోహన్‌లాల్ మాత్రం భీముడిగా కనిపించడానికి రెడీ అవుతున్నారు. ‘‘రెండు పార్ట్స్‌గా సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మొదటి పార్ట్‌ను విడుదల చేసిన, నెక్ట్స్ 90 డేస్ తర్వాత సెకండ్ పార్ట్‌ను రిలీజ్ చేస్తాం’’ అని వాసుదేవన్ నాయర్ అన్నారు. యూనిట్ అనుకున్నట్లుగానే ఈ సినిమా సెట్స్‌పైకి వెళితే.. దేశంలో 1000కోట్లతో నిర్మించిన తొలి సినిమా ఇదే అవుతుంది. వెయ్యి కోట్లా? తీసినవాళ్లు, కొన్నవాళ్లు ‘సేఫ్’ అవుతారా? అంటే.. టూ పార్ట్స్, మల్టీస్టారర్, మల్టీ లాంగ్వేజెస్‌లో రిలీజ్.. మునిగే చాన్సే లేదని ఊహించవచ్చు. 500 కోట్ల రామాయణం రామబాణానికి తిరుగులేదంటారు. అందుకే భీముడు గదతో బాక్సాఫీసు దగ్గరకు వస్తుంటే.. విల్లును ఎక్కుపెట్టి నేనూ వస్తున్నా అంటున్నాడు రాముడు. రామాయణం అంటే సీతను అడవులపాలు చేసిన రాముడు అని ఈతరం వారు అనుకుంటారు. కొందరకి అది కూడా తెలియకపోవచ్చు. ఇలాంటి టైమ్‌లో రామాయణం వస్తే? అబ్బో.. బడ్జెట్ బోలెడంత అవుతుంది. అయినా ఓకే అంటూ అల్లు అరవింద్ రామాయణం ఆధారంగా సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. మధు మంతెన, నమిత్ మల్హోత్రాలతో కలిసి త్రీ పార్ట్స్‌గా ఆయన ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. రాముడు ఎవరంటే రామ్‌చరణ్ అట. అంతేకాదు.. మెగా కాంపౌండ్‌కి చెందిన హీరోలు కీలక పాత్రల్లో కనిపిస్తారని టాక్. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఇలాంటి వార్తలు హల్చల్ చేస్తుంటాయి. ఇంతకీ రాముడు ఎప్పుడు కెమెరా ముందుకు వస్తాడు? దర్శకుడు ఎవరనేది ప్రస్తుతానికి నో క్లారిటీ. ‘‘రామాయణం వంటి సినిమాను నిర్మించాలంటే ఎంతో బాధ్యతగా ఉండాలి. బిగ్ స్రీన్‌పై చూపించడం అంత ఈజీ కాదు. అందుకే పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నాం’’ అని అల్లు అరవింద్ అప్పట్లో అన్నారు. సో... 500 కోట్లు వర్కవుట్ అవుతుందా అంటే... త్రీ పార్ట్స్ బాస్. పైగా పర్ఫెక్ట్ ప్లానింగ్ కూడా. రాముడికి తిరుగుండకపోవచ్చు. 300 కోట్ల కర్ణుడు కర్ణుడి దానగుణం ఎంత గొప్పది? ప్రాణాలనైనా తృణప్రాయంగా ఇచ్చేంత గొప్పది. మరి కురుక్షేత్ర రణరంగంలో దుష్టులైన కౌరవుల వైపు ఎందుకు ఉండాల్సి వచ్చింది? పాండవులకు కర్ణుడు ఎందుకు వ్యతిరేకం అయ్యారంటే చరిత్ర తెలుసుకోవాలి. మలయాళ దర్శకుడు ఆర్. ఎస్. విమల్ ఆ పని మీదే ఉన్నారు. విక్రమ్ టైటిల్ రోల్లో ఆయన ‘మహావీర్ కర్ణ’ అనే సినిమా తీయబోతున్నారు. 300 కోట్ల రూపాయలతో యునైటెడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ‘‘రెండేళ్లుగా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నా. కొన్ని సీన్లు రీ–రైట్ కూడా చేశా. తమిళ్, హిందీ భాషల్లో తీసి, మిగతా భాషల్లో డబ్ చేయాలనుకుంటున్నాం. ఇంటర్నేషనల్ లెవల్లో యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్‌ని తీసుకోబోతున్నాం’’ అన్నారు విమల్. డైరెక్టరే చెప్పేశారుగా.. ఇంటర్నేషనల్ లెవల్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అని.. ఇంకేం? బొమ్మ మునిగే చాన్సే లేదు. 400 కోట్ల రోబో ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్ రికార్డుల గురించి చెప్పుకోవాలంటే ప్రజెంట్ బాహుబలి, దంగల్ వసూళ్ల నుంచి స్టార్ట్ చేయాలి. ‘‘హలో... ఫ్యూచర్లో మా గురించి కూడా చెప్పుకుంటారు’’ అంటున్నారు ‘2.0’ టీమ్. ‘రోబో’కి సీక్వెల్‌గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రిలీజ్ డేట్స్‌లో కాస్త అయోమయంగా ఉన్నా కలెక్షన్స్ విషయంలో ఫుల్ క్లారిటీతో దూసుకెళ్లేలా మార్కెట్‌ను రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే వంద కోట్లకు పైగా శాటిలైట్ రైట్స్‌ను దక్కించుకున్నారు. రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీజాక్సన్ ముఖ్యతారలుగా సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇండియన్ సినిమాల్లో ఇప్పటికి ఇది హయ్యస్ట్ బడ్జెట్ మూవీ. ఆల్రెడీ శాటిలైట్, ఇతర హక్కుల రూపంలో 150 కోట్లు వచ్చేశాయట. రోబో మునిగే చాన్సే లేదు. టోటల్ కలెక్షన్స్ మిగతా సినిమాలకు షాక్ ఇస్తాయేమో! వెయిట్ అండ్ సీ. 250 కోట్ల సంఘమిత్ర బాక్సాఫీసుపై యుద్ధం చేయడానికి భీముడు, రాముడు, కర్ణుడు రెడీ అవుతున్నారు. వీళ్లతో పాటు తలపడటానికి ఓ రాణి రెడీ అవుతోంది. పేరు... సంఘమిత్ర. 250కోట్ల ఖర్చుతో దండయాత్రకు రెడీ అవుతున్నారు సంఘమిత్ర. లేడీని నమ్మి 250 కోట్లు ఖర్చుపెడుతున్నారా? అంటే.. హలో... ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘డర్టీ పిక్చర్’, ‘క్వీన్’.. ఇలా చాలా సిన్మాలున్నాయి. ఒకట్రెండు మినహా అన్నీ ఆల్మోస్ట్ లాభాలు తెచ్చినవే. ఆ ఒకటీ రెండూ సినిమాలూ ‘భేష్’ అనిపించుకున్నాయి. ఇక.. ‘సంఘమిత్ర’ గురించి చెప్పాలంటే.. ముందు శ్రుతీహాసన్ ఒప్పుకుని ఆ తర్వాత తప్పుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులకు సీన్లోకి దిశా పాట్నీ వచ్చారు. సుందర్. సి దర్శకత్వంలో తేనాండాళ్ ఫిలమ్స నిర్మిస్తున్న ఈ సినిమాలో జయం రవి, ఆర్య కీలక పాత్రలు చేయనున్నారు. ఎప్పుడో అనౌన్స్ చేసినా ఇంకా ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడంతో సంఘమిత్ర దండయాత్రకు స్టార్టింగ్ ప్రాబ్లమా? అనే డౌట్స్ వచ్చాయి. సినిమా లేట్ అవుతున్నది స్టార్టింగ్ ప్రాబ్లమ్ వల్ల కాదని, ప్రిపరేషన్ ప్లాన్ వల్ల అని అంటున్నారు చిత్రబృందం. ‘‘ప్రీ–ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. స్క్రిప్ట్‌కి చాలా టైమ్ పట్టింది. చిన్న చిన్న మార్పులు చేస్తున్నాం. గ్రాఫిక్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఏప్రిల్ లేదా మేలో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అని సుందర్ సి. స్పష్టం చేశారు. ఇది ట్రైలింగ్వుల్ మూవీ. పెట్టిన పెట్టుబడిని ‘సంఘమిత్ర’ సునాయాసంగా లాగేస్తుంది సారూ. సోనమ్ భారతం బీటౌన్‌లో మహాభారతం సినిమాపై మోస్ట్ ఇంట్రస్టెడ్ యాక్టర్ ఎవరంటే.. ఆమిర్ ఖాన్ అని చెప్పేయొచ్చు. మరి.. యాక్ట్రస్ విషయానికొస్తే సోనమ్ కపూర్. భారతంలో నటించడానికి ఆమిర్ ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు సోనమ్ కపూర్ అయితే ఏకంగా ఈ నేపథ్యంలో వచ్చిన పుస్తకాల రైట్స్ కూడా కొనేశారు. మహాభారతంపై ‘ఆర్యావతార క్రానికల్స్’ అనే టైటిల్‌తో మూడు పార్ట్స్‌గా బుక్ రచించారు ఉదయశంకర్. అందులో ఫస్ట్ పార్ట్ ‘గోవింద’ రైట్స్‌ను సోనమ్ కపూర్ కొన్నారు. దీంతో మహాభారతంపై సినిమా తీయడానికి సోనమ్ రెడీ అయ్యారన్న వార్తలు వచ్చాయి. ‘‘మహాభారతం గొప్ప కథ. ఇందులో ఏ క్యారెక్టర్ చేస్తానో ప్రస్తుతం నాకు తెలీదు’’ అని సోనమ్ పేర్కొన్నారు. సో.. ఈ సినిమా సెట్స్‌పైకి వెళితే బడ్జెట్ రెండు వందల కోట్ల పైనే ఉంటుందని ఊహించవచ్చు. 200 కోట్లకు దగ్గరగా.. ఆల్రెడీ విడుదలకు సిద్ధమైన చిత్రాల్లో ‘పద్మావత్’ బడ్జెట్ దాదాపు 180 కోట్లు అని బాలీవుడ్ టాక్. దీపికా పదుకోన్ ముఖ్య పాత్రలో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే పలు వివాదాలు, పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమా రిలీజయ్యాక ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. రెండో ఇండియన్ @ 180 కోట్లు శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ నటించిన ‘భారతీయుడు’ అప్పట్లో ఓ సంచలనం. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ ని ప్లాన్ చేస్తున్నారు. కమల్ నటిస్తారు. శంకర్ తెరకెక్కిస్తారు. ‘దిల్’ రాజు తీస్తారనే వార్త వచ్చింది. అయితే ‘దిల్’ రాజు తప్పుకున్నారు. ఫస్ట్ పార్ట్ నిర్మించిన ఎ.యం. రత్నం నిర్మించడానికి రెడీగా ఉన్నారట. ఇక, శంకర్ ప్లాన్ చేయడం, కమల్ డేట్స్ లాక్ చేయడమే ఆలస్యం. ఈ చిత్రానికి 180 కోట్లు బడ్జెట్ అవుతుందట. ‘భారతీయుడు’పై ఉన్న క్రేజ్ సీక్వెల్‌కి వర్కవుట్ అవు తుంది. సో.. రెండో భారతీయుడు వసూళ్లు ఇరగదీస్తాడని అంచనా వేయొచ్చు. -
సినిమా ఆగిపోలేదు.. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది..!
బాహుబలి ఘనవిజయం సాధించిన తరువాత అదే స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు తల పెట్టిన కోలీవుడ్ సినిమా సంఘమిత్ర. తమిళ దర్శకుడు సి సుందర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో టైటిల్ రోల్‌కు ముందుగా శృతిహాసన్ ను తీసుకున్నారు. శృతి కూడా లండన్ వెళ్లి మరీ యుద్ధవిద్యల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. కానీ సినిమా అధికారికంగా ప్రారంభించిన తరువాత స్క్రిప్ట్ ఇంకా రెడీ కాలేదన్న కారణంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.అయితే శృతిహాసన్ హ్యాండ్ ఇచ్చిన దగ్గర నుంచి సంఘమిత్ర ఆగిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై దర్శకుడు సుందర్ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. 18 నెలలుగా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలిపిన డైరెక్టర్, కొంత గ్రాఫిక్స్ వర్క్ కూడా పూర్తయిన తరువాత షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వెళ్లడించారు. జయం రవి, ఆర్యలు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో దిశాపటానిని హీరోయిన్ గా ఫైనల్ చేసే అవకాశం ఉంది. -
ఆ వేదిక మనకు కలిసి రావటం లేదా..?
అక్కడి నుంచి మనోళ్లు తీసుకునే నిర్ణయాలు కలిసి రావడం లేదంటా. అక్కడి నుంచి ప్రకటించే ఏ విషయమైనా బెడిసికొడుతుందట. ఎక్కడ..? ఏంటి..? ఏం ప్రకటించారు? ఏం విషయాలు అని అనుకుంటున్నారా? కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేదిక నుంచి మన సినిమా వాళ్లు ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి జరగడం లేదు. బాలీవుడ్ దర్శక నిర్మాత మధు భండార్కర్ ఐశ్వర్యరాయ్ లీడ్ రోల్లో ‘హీరోయిన్’ సినిమాను కేన్స్ వేదిక నుంచే ప్రకటించారు. కానీ ఆ సినిమా నుంచి ఐశ్వర్యరాయ్ తప్పుకుంది. తర్వాత కరీనా కపూర్ ‘హీరోయిన్’గా నటించింది. అదే వేదిక నుంచి తమిళ డైరెక్టర్ సి.సుందర్ కూడా శ్రుతిహాసన్ ముఖ్యపాత్రలో ‘సంగమిత్ర’ సినిమాను ప్రకటించారు. కానీ తరువాత కొన్ని కారణాలు వల్ల శ్రుతి ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించి షాక్ ఇచ్చింది. శ్రుతి తప్పు కున్న తరువాత ఆ స్థానంలో లోఫర్ బ్యూటీ దిశాపటాని వచ్చి చేరింది. సో...అదండీ మ్యాటర్..అక్కడి నుంచి మన దర్శకులు ఏ సినిమాలను ప్రకటించినా ఇలా ఏదో ఒకటి జరుగుతోంది. -
డేరింగ్ స్టెప్@డిసెంబర్!?
మొన్నటివరకూ కథ... రెడీ! కత్తులు... రెడీ! కథానాయకులు... రెడీ! కానీ, ఒక్కరు మాత్రం రెడీగా లేరు. ఎవరు? అంటే... కథానాయిక! కథానాయకులతో సమానంగా కత్తి పట్టుకుని యుద్ధం చేసే కథానాయిక లేరు. మరి, ఇప్పుడు... కత్తి పట్టుకోవడానికి దిశా పాట్నీ రెడీ! తమిళ నటులు ఆర్య, ‘జయం’ రవి హీరోలుగా నటి ఖుష్బూ భర్త, దర్శకుడు సుందర్ .సి తీయనున్న ‘సంఘమిత్ర’లో రాణి సంఘమిత్రగా నటించడానికి దిశా పాట్నీ అంగీకరించిన సంగతి తెలిసిందే. తెలుగులో ‘లోఫర్’, హిందీలో ‘ఎం.ఎస్. ధోని’ సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించిన ఈ బ్యూటీ, వారియర్ ప్రిన్సెస్ రోల్ యాక్సెప్ట్ చేయడం డేరింగ్ స్టెప్‌గా చెప్పుకోవచ్చు. ఓ పక్క హిందీ ‘బాఘీ–2’లో నటిస్తున్న దిశ, మరోపక్క ‘సంఘమిత్ర’ కోసం కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ తదితర అంశాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. డిసెంబర్ నుంచి డేరింగ్ స్టెప్ వేస్తారట! అంటే... డిసెంబర్లో ‘సంఘమిత్ర’ షూటింగ్ ప్రారంభించడానికి సుందర్ .సి సన్నాహాలు చేస్తున్నారు. ఆల్మోస్ట్ 200 కోట్ల బడ్జెట్‌తో శ్రీ తేనాండాళ్ సంస్థ ఈ సినిమా నిర్మిస్తోంది. -
శ్రుతి పోయె... దిశ వచ్చె!
...టామ్ టామ్ టామ్! తమిళ దర్శకుడు సుందర్. సి డ్రీమ్ ఫిల్మ్ ‘సంఘమిత్ర’ కథానాయిక గురించి మళ్లీ ఇంకోసారి టముకు వేసే ఛాన్స్ లేదు. రాదు కూడా. దిసీజ్ ఫైనల్ అండ్ పక్కా! ‘సంఘమిత్ర’లో రాణీ సంఘమిత్రగా దిశా పాట్నీ నటిస్తారని చిత్రబృందం వెల్లడించింది. శ్రుతీహాసన్ ‘సంఘమిత్ర’గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సిన్మా మొదలైంది. కత్తి యుద్ధం తదితర అంశాల్లో కొన్ని రోజులు శ్రుతి లండన్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు కూడా! కానీ, ఎక్కడో తేడా వచ్చింది. చిత్రబృందానికీ, శ్రుతికీ సెట్ కాలేదు. దాంతో ‘బౌండ్ స్క్రిప్ట్ ఇవ్వలేదు. షెడ్యూల్ డీటెయిల్స్ చెప్పలేదు’ అని ‘సంఘమిత్ర’ దర్శక–నిర్మాతలపై ఆరోపణలు చేశారామె. చివరకు, శ్రుతికి ‘సంఘమిత్ర’ టీమ్ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడంతో సైలెంట్ అయ్యారనుకోండి. ఈ మధ్యలో ‘శ్రుతి పోయె... హన్సిక వచ్చె! టామ్ టామ్ టామ్’ అంటూ చెన్నై కోడంబాక్కమ్‌లో టముకు వేశారు. తర్వాత ‘కొన్నాళ్లకు లేదు లేదు... హన్సిక కాదు... అనుష్క వచ్చె’ అన్నారు. కొన్నాళ్లకు ‘...కాజల్ వచ్చె’ అని టముకు వేశారు. వాళ్లెవరూ ‘సంఘమిత్ర’లోకి రాలేదు. దిశా పాట్నీ వచ్చి చేరారు. తెలుగులో ‘లోఫర్’, హిందీలో ‘ఎం.ఎస్. ధోని’ చిత్రాల్లో నటించిన దిశ.. ప్రస్తుతం హిందీలో ‘బాఘి–2’ చేస్తున్నారు. త్వరలో ‘సంఘమిత్ర’ చిత్రీకరణ ప్రారంభించనున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు 250 కోట్ల బడ్జెట్‌తో శ్రీ తేనాండాళ్ ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇందులో ‘జయం’ రవి, ఆర్య ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. -
సంఘమిత్ర నాయకి దొరికింది
తమిళసినిమా: ఇన్నాళ్లకు సంఘమిత్ర చిత్రానికి కథానా యకి సెట్ అయ్యింది. సంఘమిత్ర 8వ శతాబ్దం లో సాగే కథా చిత్రంగా ఉంటుందట. ఆ కాలపు చారిత్రక కథను దర్శకుడు సుందర్.సీ చేపట్టారు. చిత్రాన్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో నిర్మించతలపెట్టిం ది. ఇందులో మొదట విజయ్, టాలీవుడ్ నటుడు మహేశ్‌బాబుల వద్ద నుంచి కథానాయకుల ఎంపిక సాగింది. చివరికి జయంరవి, ఆర్య సెట్ అయ్యారు. ఇక కథానాయకి విషయానికి వస్తే చాలా మంది నటీమణుల పేర్లు చర్చకు వచ్చాయి. అయితే శ్రుతీహాసన్ పేరు ఖరారైంది. ఇందు కోసం ఈ బ్యూటీ కత్తిసాము, విలువిద్యను కెనడాలో శిక్షణ పొందారు కూడా. అంతే కాదు ఆరు నెలల క్రితం ఫ్రాన్స్‌లో జరిగిన కేన్స్ చిత్రోత్సవాల్లో జరిగిన సంఘమిత్ర పరిచయ కార్యక్రమంలోనూ హల్చల్ చేశారు. అలాంటిది ఆ తరువాత అనూహ్యంగా చిత్రం నుంచి వైదొలిగారు. దీంతో మళ్లీ హీరోయిన్ వేట మొదలైంది. ఈ సారి హన్సిక పేరు గట్టిగా వినిపించింది. అయితే అదీ నిజం కాలేదు. ఎట్టకేలకు సంఘమిత్ర చిత్రానికి కథానాయకి కుదిరిందన్నది తాజా సమాచారం. బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని ఈ చిత్రంతో కోలీవుడ్ రంగప్రవేశం చేయనుంది. ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సబూసిరిల్ కళాదర్శకత్వం వహించనున్నారు. చిత్ర షూటింగ్ డిసెంబరులో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లోనూ ఏక కాలంలో తెరకెక్కనుంది. -
శ్రుతీహాసన్ ప్లేస్‌లో..?
‘సంఘమిత్ర’ నుంచి శ్రుతీహాసన్ తప్పుకున్నాక ఆ ప్లేస్‌ని రీప్లేస్ చేసే తార ఎవరు? అనే చర్చ జరుగుతోంది. కచ్చితంగా ఆ స్థాయి హీరోయిన్నే తీసుకుంటారని చాలామంది భావించారు. అందుకే, అప్ కమింగ్ హీరోయిన్ దిశా పాట్నీని తీసుకోవాలనుకుంటున్నారనే వార్త విని, ఆశ్చర్యపోతున్నారు. ఒకవేళ ఈ వార్త నిజమైతే దిశా బంపర్ ఆఫర్ కొట్టేసినట్లే. తెలుగులో ‘లోఫర్’, హిందీలో ‘ఎం.ఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’, చైనీస్ మూవీ ‘కుంగ్ ఫూ యోగా’ చేశారు దిశా. ప్రస్తుతం ‘భాగీ’ అనే హిందీ చిత్రం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 250 కోట్ల ప్రాజెక్ట్ ‘సంఘమిత్ర’లో అవకాశం దక్కితే దిశా రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే. సుందర్. సి. దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. -
ఫైనల్‌గా అనుష్క చేతికే వెళ్లిందా..?
బాహుబలి తరువాత అదే స్థాయిలో సౌత్‌లో తెరకెక్కుతున్న సినిమా సంఘమిత్ర. తమిళ దర్శకుడు సుందర్.సి దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తొలుత మహేష్ బాబు, విజయ్ లాంటి స్టార్ హీరోలతో ఈ సినిమా చేయాలని భావించినా.. వారు బల్క్ డేట్స్ ఇచ్చేందుకు అంగీకరించకపోవటంతో జయం రవి, ఆర్యలు హీరోలుగా సినిమా ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక కీలకమైన సంఘమిత్ర పాత్రకు శృతిహాసన్‌ను ఫైనల్ చేశారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఘనంగా సినిమాను లాంచ్ చేశారు. అయితే లాంచింగ్ తరువాత శృతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. తనకు డేట్స్ విషయంలో క్లారిటీ ఇవ్వటం లేదన్న కారణంతో సంఘమిత్ర నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలిపింది శృతిహాసన్. దీంతో టైటిల్ రోల్ కోసం మరో స్టార్ హీరోయిన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించిన చిత్రయూనిట్... సౌత్ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అనుష్కనే సంప్రదిస్తున్నారట. ముందుగా తమన్నా, కాజల్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే పేర్లు కూడా వినిపించినా.. ఫైనల్‌గా అనుష్క కే ఫిక్స్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం భాగమతి సినిమాలో నటిస్తున్న అనుష్క సంఘమిత్రకు అంగీకరిస్తుందో.. లేదో.. చూడాలి. -
కోరికను బయటపెట్టిన హీరోయిన్!
హాట్‌హాట్ పాత్రలతో తమిళనాడులో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నీతూ చంద్ర ఇప్పుడు రాణి కావాలని తహతహలాడుతోంది. రాణిగా కనిపించాలన్న తన కోరికను ఇటీవల ఈ జాణ బయటపెట్టింది. సంఘమిత్రతో సినిమాతో ఆ కోరిక తీర్చుకోవాలనుకుంటోంది. శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించబోతున్న భారీ చారిత్రక కథా చిత్రం సంఘమిత్ర. సుందర్ సీ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో జయంరవి, ఆర్య కథానాయకులుగా నటించనున్నారు. కథానాయికగా ఎంపికైన నటి శ్రుతీహాసన్ ఈ చిత్రం నుంచి అనూహ్యంగా వైదొలగడంతో ఆ అవకాశం కోసం చాలామంది కన్నేశారు. అందులో నటి నీతూచంద్రా ఒకరు. ఆదిభగవాన్ చిత్రంలో నాయికగా యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించిన ఈ అమ్మడు ఇటీవల వైగైఎక్స్‌ప్రెస్ చిత్రంలో మెరిసింది. సంఘమిత్రలో యువరాణిగా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమె తాజాగా మీడియాకు చెప్పింది. ఒక రంగస్థల నటిగా, కరాటే క్రీడాకారిణిగా సంఘమిత్ర పాత్రకు జీవం పోయడానికి తాను శాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది. అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చారిత్రక కథాచిత్రంలో కథానాయిక పాత్రకు అగ్రనటిని తీసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని తెలుస్తోంది. హన్సిక పేరు సంఘమిత్ర కోసం ఎంచుకున్నారని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా నయనతార, అనుష్క వంటి ప్రముఖ హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మరి కొద్ది రోజుల్లో సంఘమిత్ర నాయిక ఎవరన్నది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
శృతి తప్పుకోవటంపై సంఘమిత్ర టీం క్లారిటీ
బాహుబలి రిలీజ్ తరువాత అంతకన్న భారీగా తెరకెక్కుతున్న సౌత్ సినిమాగా భారీ ప్రచారం పొందిన సినిమా సంఘమిత్ర. తమిళ దర్శకుడు సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇటీవం కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఘనంగా లాంచ్ చేశారు. ప్రధాన పాత్రల్లో శృతిహాసన్, జయం రవి, ఆర్యలు నటిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందే ఈ సినిమాపై వివాదాలు మొదలయ్యాయి. సంఘమిత్ర కోసం విదేశాల్లో కత్తి యుద్థాలు సైతం నేర్చుకున్న శృతిహాసన్ సడన్‌గా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది. నిర్మాతలు సరిగా కమ్యూనికేట్ చేయటం లేదన్న కారణంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది శృతి. అయితే దర్శకుడు సుందర్.సి వచ్చిన విభేదాల కారణంగానే శృతిహాసన్ సంఘమిత్ర నుంచి తప్పుకుందన్న టాక్ కోలీవుడ్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన చిత్రయూనిట్ శృతి తప్పుకోవడానికి దర్శకుడు కారణం కాదంటూ క్లారిటీ ఇచ్చింది. -
11 దేశాల్లో సుందర్.సి సంఘమిత్ర
నటన, దర్శకత్వం అంటూ మార్చిమార్చి విజయాలను అందుకుంటున్న దర్శక నటుడు సుందర్.సి. ఈయన తాజాగా ఒక భారీ చారిత్రక కథా చిత్రాన్ని హ్యాండిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ శత చిత్రంగా అత్యంత భారీ వ్యయంతో నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సంఘమిత్ర అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో హీరో పాత్రలకు సూర్య, విజయ్, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు వంటి నటుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆ స్టార్ నటులనెవరినీ తాము సంప్రదించలేదని దర్శకుడు సుందర్.సి స్పష్టం చేశారు. అయితే అంతర్జాతీయ ఫ్లేవర్‌తో రూపొందించనున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్, చాయాగ్రాహకుడు సుదీప్ చటర్జీ, కళా దర్శకుడు సాబు శిరిల్, సీజీ గ్రాఫిక్స్‌కు కమలకన్నన్ లాంటి సాంకేతిక నిపుణులు అవసరం అయ్యారని తెలిపారు. ఈ చిత్ర కథ పలు దేశాలల్లో నడుస్తోందన్నారు. ఆ గ్రాండీయర్ కోసం పైన చెప్పిన సాంకేతిక వర్గం పని చేయనున్నారని చెప్పారు. అయితే ఇంకా నటవర్గాన్ని ఎంపిక చేయలేదని తెలిపారు. కథకు తగ్గ ప్రముఖ నటీనటులే ఉంటారని అన్నారు. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందని చెప్పారు. కాన్సెప్ట్ డిజైనింగ్ ప్రాసస్ జరుగుతోందని తెలిపారు. చిత్ర షూటింగ్‌ను ఇండియా, అమెరికా, డెన్మార్క్, ఉక్రెయిన్, ఇరాన్ తదితర 11 దేశాల్లో నిర్వహించనున్నట్లు సమాచారం.