ఆ వేదిక మనకు కలిసి రావటం లేదా..? | Indian Movies At Cannes Film Festival | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 2 2018 4:26 PM | Last Updated on Tue, Jan 2 2018 4:26 PM

Indian Movies At Cannes Film Festival - Sakshi

అక్కడి నుంచి మనోళ్లు తీసుకునే నిర్ణయాలు కలిసి రావడం లేదంటా. అక్కడి నుంచి ప్రకటించే ఏ విషయమైనా బెడిసికొడుతుందట. ఎక్కడ..? ఏంటి..? ఏం ప్రకటించారు? ఏం విషయాలు అని అనుకుంటున్నారా?

కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేదిక నుంచి మన సినిమా వాళ్లు ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి జరగడం లేదు. బాలీవుడ్‌ దర్శక నిర్మాత మధు భండార్కర్‌ ఐశ్వర్యరాయ్‌ లీడ్ రోల్‌లో ‘హీరోయిన్‌’ సినిమాను కేన్స్‌ వేదిక నుంచే  ప్రకటించారు. కానీ ఆ సినిమా నుంచి ఐశ్వర్యరాయ్‌ తప్పుకుంది. తర్వాత కరీనా కపూర్‌ ‘హీరోయిన్‌’గా నటించింది. 

అదే వేదిక నుంచి తమిళ డైరెక్టర్‌ సి.సుందర్‌ కూడా శ్రుతిహాసన్‌ ముఖ్యపాత్రలో ‘సంగమిత్ర’ సినిమాను ప్రకటించారు. కానీ తరువాత కొన్ని కారణాలు వల్ల శ్రుతి ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించి షాక్ ఇచ్చింది. శ్రుతి తప్పు కున్న తరువాత ఆ స్థానంలో లోఫర్ బ్యూటీ దిశాపటాని వచ్చి చేరింది. సో...అదండీ మ్యాటర్‌..అక్కడి నుంచి మన దర్శకులు ఏ సినిమాలను ప్రకటించినా  ఇలా ఏదో ఒకటి జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement