డెరైక్టర్‌ని కావాలనుకున్నా! | my dream is Music Director says Vishal | Sakshi
Sakshi News home page

డెరైక్టర్‌ని కావాలనుకున్నా!

Published Wed, Apr 20 2016 10:41 PM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM

డెరైక్టర్‌ని కావాలనుకున్నా!

డెరైక్టర్‌ని కావాలనుకున్నా!

 హీరో విశాల్
 ‘‘సుందర్.సి దర్శకత్వంలో నేను చేసిన మొదటి చిత్రమిది. నేను, విజయ్ ఆంటోని కలిసి చదువుకునే రోజుల్లో  నేను డెరైక్టర్, తను మ్యూజిక్ డెరైక్టర్ అవ్వాలనుకున్నాం. కానీ, నేను హీరో అయ్యాను. విజయ్ మంచి మ్యూజిక్ డెరైక్టర్, హీరో అయ్యాడు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ‘మదగజరాజ’ చిత్రంలో ఉంటాయి’’ అని హీరో విశాల్ తెలిపారు. విశాల్, అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ కాంబినేషన్‌లో జెమిని ఫిలిం సర్క్యూట్స్ సమర్పణలో సుందర్.సి. దర్శకత్వంలో తమటం కుమార్ రెడ్డి అందిస్తున్న చిత్రం ‘మదగజరాజ ’.
 
 విజయ్ ఆంటోని స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘విశాల్ ఎనర్జిటిక్ హీరో. ఈ చిత్రంలో ఆయన ఓ పాట కూడా పాడారు’’ అని దర్శకుడు సుందర్.సి. పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే  నమ్మకముంది’’ అని తమటం కుమార్ రెడ్డి చెప్పారు. హీరోయిన్ వరలక్ష్మి, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని, నిర్మాత ఏఎం రత్నం, సహ నిర్మాత రొక్కం సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement