తమళనాడులో పొలిటికల్ ఎంట్రీపై హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఇండియాలో టాప్ హీరో లిస్ట్‌లో ఉన్న విశాల్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని చాలా ఏళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలో ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న విశాల్ రాజకీయ ప్రకటన చేశారు.
తమిళనాడులో కొత్త పార్టీని స్థాపించి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. సరైన వసతులు లేకపోవడంతో రాష్ట్రంలోని ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారందరికీ సేవ చేయడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే తన ఉద్దేశం అని.. ఈ కారణంతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు విశాల్ పేర్కొన్నారు.
ఇదే సమయంలో మరో రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా..? అని ప్రశ్నించగా.. అందుకు ఆయన నో అని చెప్పారు. ముందుగా ప్రజల్లో తాను ఏంటో నిరూపించుకోవాలని తెలిపారు. ఆ తర్వాతే ఎన్నికల పొత్తు గురించి ఆలోచిస్తానని అన్నారు. విజయ్ తర్వాత విశాల్ కూడా రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటన రావడంతో ఈ టాపిక్ ఇప్పుడు తమిళనాట భారీ చర్చలకు దారితీసింది.
తమిళనాడులో విశాల్ ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ క్రమంలో తన అమ్మగారి పేరు మీద నెలకొల్పిన ‘దేవి ఫౌండేషన్’తో ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు, బాధిత రైతులకు సాయం చేస్తున్నారు. షూటింగ్‌లకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజల కష్టాలు, అవసరాలను అడిగి తెలుసుకుని వారందరికీ తగిన సాయం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వారందరికీ తన చేతనైనంత సాయం చేస్తూ విశాల్ వార్తల్లో నిలుస్తూ వచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment