ఆ సినిమాలో ఏకంగా 24 పాటలు.. అది కూడా! | Cicada Movie Tamil First Look Launched By Vishal | Sakshi
Sakshi News home page

Cicada Movie: డైరెక్టర్‌ అయిపోయిన మ్యూజిక్ డైరెక్టర్.. దీంతో

Published Sun, Sep 10 2023 4:46 PM | Last Updated on Sun, Sep 10 2023 5:25 PM

Cicada Movie Tamil First Look Launched By Vishal - Sakshi

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తీస్తున్న సినిమా 'సికాడ'. సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీజిత్‌ ఎడవానా.. ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. తొలి ప్రయత్నంలోనే నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీ గురించి ఆయన పలు విషయాలు చెప్పారు. 

(ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్ బయోపిక్.. ఐదేళ్ల క్రితమే మొదలైంది కానీ)

ఈ సినిమా ఉత్కంఠ భరితంగా సాగే అడ్వంచర్ థ్రిల్లర్‌ అని డైరెక్టర్ శ్రీజిత్ చెప్పుకొచ్చాడు.  నాలుగు భాషల్లో ఒకే టైటిల్‌లో ఒకేసారి తీస్తున్న ఈ చిత్రంలో 24 పాటలు ఉంటాయని అన్నారు. తీర్నా ఫిలిమ్స్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వందన మీనన్‌, పి.గోపకుమార్‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిత్‌ సీఆర్‌ జాయ్స్‌ జోస్‌, గాయత్రి మయూర తదితరులు ప్రధాన పాత్రలు పోషించారని చెప్పారు.

నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను నటుడు విశాల్‌ చేతుల మీదుగా ఆవిష్కరించినట్లు చెప్పారు. టాలెంట్‌ని ప్రోత్సహించే విశాల్‌.. తమ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని చూసి యూనిట్‌ను అభినందించినట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.

(ఇదీ చదవండి: ఓ ఇంటివాడు కాబోతున్న మానస్‌.. హల్దీ వేడుకలు షురూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement