Vishal Marriage: పెళ్లెప్పుడు? విశాల్‌ సమాధానమిదే! ఇంక చేసుకున్నట్లే! | Vishal: Will Marry After These Three Actors Married | Sakshi
Sakshi News home page

Vishal Marriage: విశాల్‌కు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యముందా? బ్రహ్మచారిగానే మిగిలిపోతాడా?

Published Wed, May 22 2024 7:58 PM | Last Updated on Wed, May 22 2024 8:30 PM

Vishal: Will Marry After These Three Actors Married

46 ఏళ్లొచ్చినా ఈయన మాత్రం వివాహానికి తొందరేముంది అన్నట్లుగా నిమ్మకు నీరెత్తకుండా ఉండిపోయాడు. కానీ జనాలు ఊరుకుంటారా? మెడ మీద కత్తిపెట్టి

సినిమా ఇండస్ట్రీలో పెళ్లి కాని ప్రసాదులు చాలామందే ఉన్నారు. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన హీరోలు పెళ్లి వైపు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. అదేమంటే.. ఆ హీరో పెళ్లయ్యాక చేసుకుంటా, ఈ హీరో జోడీని వెతుక్కున్నాక చేసుకుంటా అని సాకులు చెప్తుంటారు. హీరో విశాల్‌ కూడా ఇదే రూటులో వెళ్తున్నాడు.

పెళ్లి ఊసే లేదు!
తను గతంలో ప్రేమించిన ఓ బ్యూటీ కూడా పెళ్లి చేసుకోబోతుంది. 46 ఏళ్లొచ్చినా ఈయన మాత్రం వివాహానికి తొందరేముంది అన్నట్లుగా నిమ్మకు నీరెత్తకుండా ఉండిపోయాడు. కానీ జనాలు ఊరుకుంటారా? మెడ మీద కత్తిపెట్టి అడిగినట్లుగా పెళ్లెప్పుడో చెప్పు అని ప్రశ్నిస్తూనే ఉన్నారు.

తెలివైన సమాధానం
దీనికి విశాల్‌ చాలా తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. సల్మాన్‌ ఖాన్‌, శింబు, ప్రభాస్‌.. ఈ ముగ్గురు పెళ్లి చేసుకున్నాకే నేను కూడా లైఫ్‌లో సెటిలవుతాను అని చెప్పాడు. శింబుకు మంచి అమ్మాయిని చూసి మూడు ముళ్లు వేయించాలని వేట మొదలుపెట్టారట అతడి పేరెంట్స్‌. ప్రభాస్‌ అంటారా? సినిమాల మీద తప్ప పర్సనల్‌ లైఫ్‌ గురించి పట్టించుకుందే లేదు.

సల్మాన్‌ పేరు చెప్పాడంటే..
ఇక సల్మాన్‌ విషయానికి వస్తే.. ఆయనకసలు మ్యారేజ్‌ చేసుకునే ఉద్దేశమే లేదు. మరి విశాల్‌ ఈ ముగ్గురి తర్వాతే అంటున్నాడంటే తనకసలు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? లేదా బ్రహ్మచారిగా మిగిలిపోతాడా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్‌.

చదవండి: విడాకుల రూమర్స్‌.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement