'రత్నం' ట్రైలర్.. విశాల్ మళ్లీ అలాంటి సినిమానే! | Vishal Rathnam Movie Trailer Telugu | Sakshi

Rathnam Trailer: 'రత్నం' ట్రైలర్.. విశాల్ మళ్లీ అలాంటి సినిమానే!

Published Mon, Apr 15 2024 6:35 PM | Last Updated on Mon, Apr 15 2024 6:35 PM

Vishal Rathnam Movie Trailer Telugu - Sakshi

విశాల్ హీరోగా నటిస్తున్న సినిమా 'రత్నం'. ఫస్ట్ లుక్, పాటలు అవి రిలీజైనప్పుడే ఇది యాక్షన్ చిత్రమని అనిపించింది. ఇప్పుడు ట్రైలర్ రావడంతో స్టోరీపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఏప్రిల్ 26న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పడు చూద్దాం.

(ఇదీ చదవండి: నా పెళ్లి వల్ల తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడ్డారు: ప్రియమణి)

'రత్నం' కథ విషయానికొస్తే.. హీరో పేరు రత్నం. ఓ రాజకీయ నాయకుడి దగ్గర పనిచేస్తుంటాడు. హీరోయిన్ (ప్రియా భవానీ శంకర్)ని కొందరు దుండగులు ఎందుకో చంపాలని చూస్తుంటారు. వాళ్ల నుంచి హీరో ఆమెని ఎలా రక్షించాడనేదే స్టోరీలా అనిపిస్తుంది.

'సింగం' సిరీస్ సినిమాలతో దర్శకుడిగా తనకంటా సెపరేట్ క్రేజ్ సంపాదించిన దర్శకుడు హరి.. 'రత్నం' సినిమాని తీశాడు. పూర్తిస్థాయి యాక్షన్ కథతో తీశారు కానీ కథే పాత చింతకాయ పచ్చడిలా అనిపిస్తుంది. ఇదివరకే ఈ తరహా సినిమాల్లో విశాల్ కనిపించాడు. మరి ఈ సినిమాలో ఏమైనా కొత్తగా ఉందా లేదా అనేది థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఓ క్లారిటీ వచ్చేస్తుంది. అసలే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు డిఫరెంట్ సినిమాల్ని తప్పితే రొటీన్ చిత్రాల్ని పెద్దగా ఆదరించడం లేదు. మరి 'రత్నం' సినిమాని ఏం చేస్తారో చూడాలి?

(ఇదీ చదవండి: డైరెక్టర్ శంకర్ కూతురికి రెండో పెళ్లి.. కుర్రాడు ఎవరంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement