Rathnam Movie
-
నెల రోజుల్లోపే ఓటీటీకి స్టార్ హీరో సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం 'రత్నం'. గతనెల ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈనెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తమిళ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మేనన్ కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్ 26 విడుదలైన ఈ చిత్రం నెల రోజుల్లోపే ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చేస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. -
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
కోలీవుడ్ డైరెక్టర్ హరి- విశాల్ కాంబోలో వచ్చిన సినిమా 'రత్నం'. ఏప్రిల్ 26న విడుదలైన ఈ చిత్రం విశాల్ అభిమానులను మెప్పించింది. పలు ట్విస్ట్‌లతో పాటు భారీ ఫైట్స్‌తో మాస్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంది. అయితే, సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. కమర్షియల్ చిత్రాలను అందించడంలో దర్శకుడిగా హరికి మంచి గుర్తింపు ఉంది. ఆయన నుంచి ఇప్పటికే భరణి, పూజా,సింగం సీక్వెల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ నటించింది. ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆ రోజు సినిమాకు పోటీగా మరే పెద్ద సినిమా విడుదల కాకపోవడంతో రత్నం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడంతో రత్నం సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఇప్పుడు రత్నం సినిమా ఓటీటీలోకి రానుంది. మే 24న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని నెట్టింట వైరల్ అవుతుంది. కొద్దిరోజుల్లో చిత్ర మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రావచ్చని తెలుస్తోంది. -
‘రత్నం’ మూవీ రివ్యూ
టైటిల్ : రత్నంనటీనటులు: విశాల్, ప్రియా భవానీ శంకర్, మురళీ శర్మ, గౌతమ్ మీనన్, సముద్రఖని, యోగిబాబు తదితరులునిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్దర్శకత్వం: హరిసంగీతం: దేవీ శ్రీ ప్రసాద్విడుదల తేదిఫ: ఏప్రిల్ 26, 2024‘భరణి’, ‘పూజా’సినిమాల తర్వాత మాస్ యాక్షన్ హీరో, పురుచ్చి దళపతి విశాల్, యాక్షన్ డైరెక్టర్ హరి కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘రత్నం’. కార్తికేయన్ సంతానం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌ని ప్రేక్షకులను నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ‘రత్నం’పై టాలీవుడ్‌లోనూ భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రత్నం(విశాల్) చిత్తూరు మార్కెట్లో పని చేస్తుంటాడు. చిన్నప్పుడు ఓ సారి అదే మార్కెట్‌కు చెందిన పన్నీర్ సామి(సముద్రఖని)ని చంపేందుకు వచ్చిన ఓ మహిళను కత్తితో చంపేస్తాడు. తన ప్రాణాలను కాపాడడనే సానుభూతితో రత్నాన్ని తనవద్దే ఉంచుకుంటాడు పన్నీర్. కొన్నాళ్లకు పన్నీర్ ఎమ్మెల్యే అవుతాడు. అతని తోడుగా ఉంటూ నియోజకవర్గంలో ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తాడు రత్నం. ఓ సారి నీట్ పరీక్ష రాసేందుకు చిత్తూరు వచ్చిన మల్లిక(ప్రియా భవానీ శంకర్)ని చూసి, ఫాలో అవుతాడు. అదే సమయంలో అమెను చంపేందుకు లింగం(మురళీ శర్మ) గ్యాంగ్ చిత్తూరు వస్తుంది. వారి నుంచి మల్లికను కాపాడమే కాదు, దగ్గరుండి మరీ పరీక్ష రాయిస్తాడు. అసలు మల్లిక ఎవరు? ఆమెకు రత్నంకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? లింగం మనుషులు ఆమెను ఎందుకు వెంబడిస్తున్నారు? రత్నం తల్లి రంగనాయకమ్మ ఎలా చనిపోయింది? లింగం నేపథ్యం ఏంటి? మల్లిక కుటుంబానికి వచ్చిన సమస్యను తీర్చే క్రమంలో రత్నంకు తెలిసిన నిజం ఏంటి? ఆ నిజం తెలిసిన తర్వాత రత్నం ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. మాస్ సినిమాలను డిఫరెంట్‌గా తెరకెక్కించడంలో డైరెక్టర్ హరి స్పెషలిస్ట్. నాన్ స్టాప్ యాక్షన్‌తో కథనాన్ని పరుగులు పెట్టిస్తాడు. అందుకే సింగంతో పాటు దానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రాలన్నీ తెలుగులోనూ మంచి విజయం సాధించాయి. రత్నం కూడా అదే తరహాలో తెరకెక్కించాడు. కావాల్సినంత యాక్షన్‌తో కథనాన్ని పరుగులు పెట్టించాడు. కానీ కథలో మాత్రం కొత్తదనం మిస్ అయింది. యాక్షన్ సీన్స్‌తో పాటు ప్రతి సన్నివేశం రొటీన్‌గానే అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రం కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. కాని అది ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. 1994లో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో జరిగే బస్సు దోపిడి సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథంతా చిత్తూరు మార్కెట్ చుట్టూ తిరుగుతుంది. రత్నం చైల్డ్ ఎపిసోడ్ తర్వాత కథ వెంటనే 2024లోకి వెళ్లిపోతుంది. అక్కడ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. హీరో.. హీరోయిన్ చూసి ఎక్కడో చూసినట్లు భావించడం.. ఆమెను ఫాలో అవుతూ.. లింగం గ్యాంగ్ నుంచి కాపాడడం.. ఇలా ప్రతీ సన్నివేశం రొటీన్‌గానే అనిపిస్తుంది. మధ్య మధ్య యోగిబాబు వేసే కామెడీ పంచులు మినహా ఫస్టాఫ్ అంతా రొటీన్‌గానే సాగుతుంది. హీరోయిన్ విషయంలో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ కన్విసింగ్‌గా అనిపించడు. దీంతో సెకండాఫ్ అంతా మరింత రొటీన్ సాగుతు బోర్ కొట్టిస్తుంది. కథనం పరుగులు పెట్టినట్లే అనిపిస్తుంది కానీ..ఎక్కడా ఆసక్తిని రేకెత్తించదు. కొన్ని యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశాల్. ఆయన నుంచి ఓ యాక్షన్ సినిమా వస్తుందంటే ఆ క్రేజే వేరే లెవల్లో ఉంటుంది. ఈ జానర్ సినిమాల్లో విశాల్ మరింత రెచ్చిపోయి నటిస్తాడు. రత్నంలోనూ అలానే నటించాడు. ఎప్పటిమాదిరే కథంతా తన భుజానా వేసుకొని నడిపించాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషన్ సీన్స్‌లోనూ చక్కగా నటించాడు. మల్లిక పాత్రకు ప్రియా భవానీ శంకర్ న్యాయం చేసింది. కథంతా ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. లింగంగా మురళీ శర్మ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.ఎమ్మెల్యే పన్నీర్‌గా సముద్రఖనీ తన పాత్ర పరిధిమేర బాగానే నటించాడు. హీరో స్నేహితుడు మూర్తిగా యోగిబాబు వేసే పంచులు, కామెడీ బాగా వర్కౌట్ అయింది. హరీశ్ పేరడీ, గౌతమ్ మీనన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. పాటలతో పాటు కొన్ని చోట్ల అదిరిపోయే బీజీఎం అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
రత్నం కథ ఇదే.. అందరికి నచ్చే హీరో ఎవరంటే: హరి
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన రత్నం చిత్రం ఏప్రిల్ 26న తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరపైకి రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచారంలో ముమ్మరంగా మునిగిపోయింది. కమర్శియల్ దర్శకుడిగా ముద్ర వేసుకున్న హరి దర్శకత్వం వహించిన చిత్రం రత్నం. ఈయన నటుడు విశాల్‌తో భరణి,పూజా చిత్రాలతో హిట్ కొట్టారు. ఇప్పుడు మూడో చిత్రంగా రత్నం వస్తుంది. కాగా దర్శకుడు హరి ఇటీవల పుదుచ్చేరిలో విశాల్ అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రత్నం చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.రోడ్డులో వెళుతున్నప్పుడు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎవరూ సాయపడటానికి ముందుకు రావడం లేదని, వేడుకగా చూస్తున్నారని, అలా సాయం చేసే ఒక యువకుడి ఇతి వృత్తమే రత్నం చిత్రం కథ అని చెప్పారు. ఇకపోతే నటుడు విజయ్, త్రిష జంటగా నటించిన గిల్లీ తెలుగులో (ఒక్కడు) చిత్రం ఇటీవల రీ-రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు సాధిస్తోందన్నారు. మంచి చిత్రాలు ఎప్పుడు విడుదలైనా ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఈ చిత్రం ఒక ఉదాహరణ అన్నారు.ఇలాంటి చిత్రాలను చూస్తున్నప్పుడు మంచి చిత్రాలు చేయాలని దర్శకులకు ఉద్వేగం కలుగుతుందన్నారు. సాధారణంగా నటులకు ఒక వర్గం అభిమానులే ఉంటారని, అయితే రజకాంత్ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమాన నటుడని పేర్కొన్నారు. తలైవన్ చిత్రం వస్తుందంటే తొలిరోజునే చూస్తానని చెప్పారు. మరో విషయం ఏమిటంటే ఏ దర్శకుడు జాతి గురించో, మతం గురించో చిత్రం చేయాలని భావించరని దేశంలో జరుగుతున్న జాతి, మతం ఆలోచనలనే సినిమాగా తీస్తారని చెప్పారు. సినిమా అనేది జాతి, మతం, భాషలకు అతీతం అని దర్శకుడు హరి పేర్కొన్నారు. -
'రత్నం' ట్రైలర్.. విశాల్ మళ్లీ అలాంటి సినిమానే!
విశాల్ హీరోగా నటిస్తున్న సినిమా 'రత్నం'. ఫస్ట్ లుక్, పాటలు అవి రిలీజైనప్పుడే ఇది యాక్షన్ చిత్రమని అనిపించింది. ఇప్పుడు ట్రైలర్ రావడంతో స్టోరీపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఏప్రిల్ 26న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పడు చూద్దాం. (ఇదీ చదవండి: నా పెళ్లి వల్ల తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడ్డారు: ప్రియమణి) 'రత్నం' కథ విషయానికొస్తే.. హీరో పేరు రత్నం. ఓ రాజకీయ నాయకుడి దగ్గర పనిచేస్తుంటాడు. హీరోయిన్ (ప్రియా భవానీ శంకర్)ని కొందరు దుండగులు ఎందుకో చంపాలని చూస్తుంటారు. వాళ్ల నుంచి హీరో ఆమెని ఎలా రక్షించాడనేదే స్టోరీలా అనిపిస్తుంది. 'సింగం' సిరీస్ సినిమాలతో దర్శకుడిగా తనకంటా సెపరేట్ క్రేజ్ సంపాదించిన దర్శకుడు హరి.. 'రత్నం' సినిమాని తీశాడు. పూర్తిస్థాయి యాక్షన్ కథతో తీశారు కానీ కథే పాత చింతకాయ పచ్చడిలా అనిపిస్తుంది. ఇదివరకే ఈ తరహా సినిమాల్లో విశాల్ కనిపించాడు. మరి ఈ సినిమాలో ఏమైనా కొత్తగా ఉందా లేదా అనేది థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఓ క్లారిటీ వచ్చేస్తుంది. అసలే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు డిఫరెంట్ సినిమాల్ని తప్పితే రొటీన్ చిత్రాల్ని పెద్దగా ఆదరించడం లేదు. మరి 'రత్నం' సినిమాని ఏం చేస్తారో చూడాలి? (ఇదీ చదవండి: డైరెక్టర్ శంకర్ కూతురికి రెండో పెళ్లి.. కుర్రాడు ఎవరంటే?) -
రత్నం సినిమా నుంచి మరో సాంగ్ వచ్చేసింది
నటుడు విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రత్నం. కమర్షియల్ దర్శకుడు హరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు తామరబరణి, పూజ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి అన్నది గమనార్హం. కాగా తాజాగా విశాల్ దర్శకుడు హరి కాంబోలో హ్యాట్రిక్ చిత్రం రత్నం. నటి ప్రియా భవాని శంకర్ నాయకిగా నటిస్తున్న ఇందులో సముద్రఖని, యోగిబాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ సుబ్బురాజ్ స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, జి.స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈచిత్రాన్ని ఏప్రిల్ 26వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని సింగిల్ సాంగ్ ఇటీవల విడుదల చేశారు. తాజాగా రెండవ పాటను శుక్రవారం విడుదల చేశారు. ఎదనాల అనే పల్లవితో సాగే ఈ మెలోడి పాటను గీత రచయిత వివేక్ రాయగా నటుడు విశాల్, నటి ప్రియా భవాని శంకర్‌లపై చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. రత్నం చిత్రం కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విశాల్ ఇంతకుముందు నటించిన మార్క్ ఆంటోని చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ తరువాత రాబోతున్న రత్నం చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. -
రత్నం సినిమాలో పాట పాడిన దేవి శ్రీ ప్రసాద్
-
విశాల్ భారీ యాక్షన్ మూవీ.. విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్
మాస్ యాక్షన్ హీరో, పురుచ్చి దళపతి విశాల్ సినిమాకు అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉంటుంది. విశాల్ అంటే అందరికీ యాక్షన్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. అలాంటిది డైరెక్టర్ హరితో యాక్షన్ సినిమా అంటే మామూలుగా ఉండదు. వీరిద్దరి కాంబినేషన్లో యాక్షన్ మూవీ అంటే అభిమానులకు ఇక పండుగే. దానికి తగ్గట్టుగానే ‘రత్నం’ అనే మూవీ ఫుల్ యాక్షన్ మోడ్‌లో రాబోతోంది. ఆల్రెడీ ఇప్పటి వరకు వదిలిన కంటెంట్ చూసి మాస్ లవర్స్‌లో భారీ అంచనాలు పెరిగాయి. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. రత్నం చిత్రానికి హరి డైరెక్టర్‌గా, కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్. ఈ మూవీలో విశాల్ హీరోగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. రత్నం ఫస్ట్ షాట్ టీజర్, పాటలు ఇలా ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్టుగా మేకర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిత్రయూనిట్ రిలీజ్ డేట్‌ను లాక్ చేసింది. ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. సమ్మర్లో విశాల్ యాక్షన్ మూవీ థియేటర్లోకి రాబోతోందని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇకపై వరుసగా అప్డేట్లతో రత్నం టీం సందడి చేయనుంది. -
తలలు నరికే ఊరమాస్‌గా విశాల్... ‘రత్నం’ టీజర్ అదుర్స్
విశాల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రత్నం’. ఈ చిత్రానికి ‘సింగం’ సిరీస్ ఫేమ్ హరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. కార్తికేయన్ సంతానం, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఓ పెద్ద మైదానంలో బర్రెలు, గుర్రాలు పరిగెడుతూ ఉండగా వాటి మధ్య లారీ నుంచి దిగి వచ్చి మోకాలి మీద కూర్చున్న ఒక వ్యక్తి తలని విశాల్ నరికి, దాన్ని చేత్తో పట్టుకుని నడిచి వచ్చే సన్నివేశాన్ని టీజర్లో చూపించారు. ‘కన్నీరే నెత్తురు చిందగా.. క్రోధమే రుధిరం చిమ్మగా.. ఆగ్రహమే అరుణధారగా.. రణరంగమే రక్తపు ఏరుగా...’ వంటి డైలాగులు టీజర్లో వినిపిస్తాయి. ‘రత్నం’ చిత్రంలో విశాల్ మరోసారి మాస్ లుక్‌లో కనిపించనున్నారని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2024 వేసవిలో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. సముద్ర ఖని, గౌతమ్ మీనన్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.