విశాల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రత్నం’. ఈ చిత్రానికి ‘సింగం’ సిరీస్ ఫేమ్ హరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. కార్తికేయన్ సంతానం, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఓ పెద్ద మైదానంలో బర్రెలు, గుర్రాలు పరిగెడుతూ ఉండగా వాటి మధ్య లారీ నుంచి దిగి వచ్చి మోకాలి మీద కూర్చున్న ఒక వ్యక్తి తలని విశాల్ నరికి, దాన్ని చేత్తో పట్టుకుని నడిచి వచ్చే సన్నివేశాన్ని టీజర్‌లో చూపించారు.
‘కన్నీరే నెత్తురు చిందగా.. క్రోధమే రుధిరం చిమ్మగా.. ఆగ్రహమే అరుణధారగా.. రణరంగమే రక్తపు ఏరుగా...’ వంటి డైలాగులు టీజర్‌లో వినిపిస్తాయి. ‘రత్నం’ చిత్రంలో విశాల్ మరోసారి మాస్ లుక్‌లో కనిపించనున్నారని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2024 వేసవిలో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. సముద్ర ఖని, గౌతమ్ మీనన్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment