చలో కోల్‌కత్తా | Kajol and Vishal movie schedule starts in Kolkata | Sakshi
Sakshi News home page

చలో కోల్‌కత్తా

Published Mon, Dec 18 2023 1:35 AM | Last Updated on Mon, Dec 18 2023 1:35 AM

Kajol and Vishal movie schedule starts in Kolkata - Sakshi

ప్రేక్షకులను భయపెడతా అంటున్నారు బాలీవుడ్‌ నటి కాజోల్‌. ఆమె ప్రధాన పాత్రధారిగా విశాల్‌ ఫురియా ఓ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని బాలీవుడ్‌ సమాచారం. పూర్తి స్థాయి హారర్‌ జానర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీప్రోడక్షన్‌ వర్క్స్‌ పూర్తి కావొచ్చాయని, జనవరిలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించేలా విశాల్‌ ప్లాన్‌ చేశారని టాక్‌.

తొలి షెడ్యూల్‌ కోల్‌కతాలో మొదలవుతుందట. నెల రోజులకు పైగా అక్కడి లొకేషన్స్‌లో ఈ సినిమా చిత్రీకరణను ప్లాన చేశారట యూనిట్‌. ఇక ఈ సినిమాను కాజోల్‌ భర్త, దర్శక–నటుడు, నిర్మాత అజయ్‌ దేవగన్‌ నిర్మించనున్నారని బాలీవుడ్‌ భోగట్టా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement