
మహేష్ మూవీ టైటిల్ అదేనా..?
బ్రహ్మోత్సవం సినిమా తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు జెట్ స్పీడుతో షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మాత్రమే చేస్తోన్న మహేష్, తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు టైటిల్గా రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ముందుగా ఎనిమి అనే టైటిల్ దాదాపుగా ఫైనల్ అన్న టాక్ వినిపించింది. తరువాత చట్టంతో పోరాటం, వాస్కోడాగామ లాంటి పేర్లు తెర మీదకు వచ్చినా.. చిత్రయూనిట్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. అయితే తాజాగా ఈ సినిమాకు అభిమన్యుడు అనే టైటిల్ను నిర్ణయించారన్న వార్త ఫిలిం సర్కిల్స్లో వినిపిస్తోంది. మహేష్ కూడా ఇదే టైటిల్కు మొగ్గుచూపుతున్నాడట. మరి ఈ టైటిల్ పై అయినా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.