
సినిమా బావుంటే చాలు.. అది పెద్ద హీరో.. చిన్న హీరో అని చూడకుండా కచ్చితంగా ప్రశంసిస్తారు మహేశ్‌బాబు. తాజాగా ‘అభిమన్యుడు’ సినిమాను ప్రశంసించారాయన. విశాల్, సమంత, అర్జున్ ముఖ్యపాత్రల్లో పి.యస్. మిత్రన్ దర్శకత్వంలో జి.హరి నిర్మించిన ‘అభిమన్యుడు’ జూన్ 1న రిలీజై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ‘‘అభిమన్యుడు’ చిత్రం చాలా బాగా నచ్చింది. మిత్రన్ ఓ విజన్‌తో చక్కగా తెరకెక్కించారు. రీసెర్చ్‌తో, ఫాస్ట్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన ఈ చిత్రం ఆకట్టుకుంది. విశాల్, చిత్రబృందానికి అభినందనలు’’ అని పోస్ట్ చేశారు మహేశ్.
‘‘మంచి చిత్రాలను ప్రోత్సహించే మహేశ్ మా సినిమాను ప్రశంసించడం ఆనందంగా ఉంది. థ్యాంక్స్’’ అన్నారు విశాల్. ‘‘మహేశ్‌గారి అభినందనలు మాకు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. ఈ సినిమా 18రోజుల్లో 18 కోట్లు వసూలు చేసింది’’ అన్నారు జి.హరి. ‘‘నా మొదటి సినిమానే ఇంత హిట్ సాధించడం, మహేశ్‌గారి అభినందనలు పొందడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు మిత్రన్.
Comments
Please login to add a commentAdd a comment