పైరసీని ఎంకరేజ్‌ చేయకండి : విజయ్‌ ఆంటోని | Vijay Antony Promotes His Killer Movie | Sakshi
Sakshi News home page

పైరసీని ఎంకరేజ్‌ చేయకండి : విజయ్‌ ఆంటోని

Published Tue, Jun 11 2019 10:08 AM | Last Updated on Tue, Jun 11 2019 11:34 AM

Vijay Antony Promotes His Killer Movie - Sakshi

‘బిచ్చగాడు’ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్‌ ఆంటోని.. ఇక్కడ కూడా క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అప్పటినుంచి డబ్బింగ్‌ సినిమాలతో టాలీవుడ్‌ను పలకరించినా.. బిచ్చగాడు రేంజ్‌ సక్సెస్‌ను సాధించలేకపోయారు. అయితే ఈ శుక్రవారం కిల్లర్‌ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తో కలిసి నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

తెలుగులో ప్రమోషన్‌ సరిగా లేక కిల్లర్‌ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు అంతగా పట్టించుకోవడం లేదు గానీ, కోలీవుడ్‌లో ఈ చిత్రం ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకుపోతుండగా.. ఈ చిత్రాన్ని థియేటర్లలోనే చూడండని, పైరసీనీ ఎంకరేజ్‌ చేయకండని విజయ్‌ ఆంటోని ప్రేక్షకులను కోరారు. మంచి సినిమాలను ఆదరించాలని చెబుతూ ఓ వీడియోను పోస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement