
బేబి రసజ్ఞ టైటిల్ రోల్‌లో, శ్రీరాజ్ గౌడ్, పూజ జంటగా తెరకెక్కిన చిత్రం ‘అమ్మో అమ్మోరు’. టి.రాము దర్శకత్వంలో మనీష్ గౌర్ సమర్పణలో బిఎన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. ముఖ్య అతిథి, నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘సంగీత దర్శకుడు అర్జున్‌గారు నా తొంభై సినిమాలకు సంగీతం అందించారు. ‘అమ్మో అమ్మోరు’ చిత్రానికి కూడా తను మంచి పాటలిచ్చారు. టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా విజయవంతం అవ్వాలి’’ అన్నారు.
‘‘దేవుడికీ, దుష్ట శక్తికీ మధ్య జరిగే పోరాటమే ఈ చిత్రం. ఇందులో నాలుగు పాటలున్నాయి. పాటలతో పాటు నేపథ్య సంగీతానికీ ప్రాధాన్యం ఉంది’’ అన్నారు సంగీత దర్శకుడు అర్జున్. ‘‘రాము మంచి కథతో ఈ సినిమా తీశాడు. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు నిర్మాత బియన్ రెడ్డి. బేబి రసజ్ఞ, నిర్మాత సాయి వెంకట్, శ్రీరాజ్ గౌడ్, పూజ, దర్శకులు హరిబాబు, అళహరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment