నేహాపై ఫైర్‌ అయిన మెరీనా.. బుద్ధి ఉండదా అంటూ ఆగ్రహం | Bigg Boss 6 Telugu: Captaincy Contenders Task Come To An End | Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: సత్యతో లవ్‌ట్రాక్‌ నడిపేందుకు తెగ ట్రై చేస్తున్న అర్జున్‌

Published Thu, Sep 22 2022 1:36 PM | Last Updated on Thu, Sep 22 2022 1:58 PM

Bigg Boss 6 Telugu: Captaincy Contenders Task Come To An End - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-6లో కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన అడవిలో ఆట టాస్క్‌ చివరి దశకు చేరుకుంది. ఈ టాస్కులో చివరిరోజు కూడా పోలీసులకు, దొంగలకు మధ్య వాగ్వివాదం నడుస్తుంది. పట్టుబడిని మెరీనాను దొంగలు బెడ్‌రూమ్‌లో వేసి లాక్‌ చేస్తారు. దీంతో ఆమె అక్కడున్న కబోర్డ్స్‌లలో బొమ్మలు వెతుకుతుంటుంది. దీంతో ఆమెకు ఆ యాక్సిస్‌ లేదని, అలా చేయడానికి వీళ్లేదని నేహా ఫైర్‌ అవ్వగా.. మాటిమాటికి గుర్రు అంటే ఎట్లా? బుద్ది ఉండదా? అంటూ మెరీనా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరోవైపు వంద రూపాయలకి ఒక బొమ్మ కొంటానంటూ గీతూ దొంగలతో డీల్‌ మాట్లాడుతుంది. అంతేకాకుండా చివర్లో వాళ్లకు ఓ బహుమతి కూడా ఇస్తానని ఆఫర్‌ చేస్తుంది. ఇదిలా ఉండగా సత్యతో పరిహోర కలపేందుకు అర్జున్‌ తెగ ట్రై చేస్తున్నాడు. అయినా సరే పట్టించుకోని సత్య.. హౌస్‌లో అందరినీ అన్నయ్య అనే పిలుస్తానని  చెప్పడంతో అర్జున్‌ కాస్త ఫీల్‌ అయినట్లు కనిపిస్తుంది.

ఇప్పటికే సత్యను తప్పా మిగతా అందిరినీ సిస్టర్‌ అని పిలుస్తానని చెప్పిన అర్జున్‌ సత్యతో లవ్‌ ట్రాక్‌ నడిపిందుకు రకరకాల ఫీట్లు చేస్తున్నాడు. దీనికి సత్య రియాక్షన్‌ ఏమైనా మారుతుందా లేక నో ఫీలింగ్స్‌ అంటూ అలానే ఉండిపోతుందా చూద్దాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement